Wednesday, July 9, 2025

సరస్వతి దేవి/పద్యాలు

 అంశం: చిత్ర పద్యం (సరస్వతి మాత)


శీర్షిక: సరస్వతీదేవి

ఆ.వె:01
ధవళవస్త్రములను ధారణ జేసియు
హంసవాహనంబు నందునెక్కి
అవని జేరె తల్లి నజ్జానమును బాప
కృష్ణ మాట వినుము తృష్ణ దీర!

ఆ.వె:02
సకలకళలందు చక్కని నేర్పరి
విద్య లెన్నొ నేర్పు వీణపాణి
జ్ఞానములను పంచు జ్ఞానదేవత మాత
కృష్ణ మాట వినుము తృష్ణ దీర!

ఆ.వె:03
వీణనిష్టపడును విజ్ఞాన దాయిని
నవ్వు మోముతోడ నాదరించు
పుణ్య మూర్తి తల్లి పుస్తక ధారణి
కృష్ణ మాట వినుము తృష్ణ దీర!




No comments: