Thursday, July 17, 2025

సమన్వయం తోనే లక్ష్యం సాధ్యం

*నేటి అంశం*కథా కవిత*


శీర్షిక: *సమన్వయంతోనే లక్ష్యం సాధ్యం*

తాను గొప్ప పారిశ్రామిక వేత్త అయినా
వేలకోట్లు పెట్టుబడులు పెట్టినా
తాను గొప్ప ఇంజినీర్ అయినా
గగన వాహన చోదకులతో
గగన శిఖామణులతో
గగన వాహనాలను సరిచేయు వారితో
ఇంధనం అందించువారితో మరెందరితోనో
సమన్వయం కలిగి ఉండాలి.
సమూహంలోని అందరితో సమైక్యంగా
ఉండాలి. లోటు పాట్లు సవరిస్తుండాలి
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే
ప్రయోజనం శూన్యం
గుజరాత్ లో గగన వాహనం కూలి నట్లుగా
వేల కోట్లు నష్ట పోవాల్సి వస్తుంది
వెల కట్టలేని మానవసంపదను
కోల్పోవల్సి రావచ్చు

అది ఏ సంస్థలో నైనా కావచ్చు
అలానే అంతా నాకే తెలుసు అనే
అహంకారం గర్వం ఉన్న వ్యక్తికైననూ
సం‌స్థకైననూ వర్తిస్తుంది?

లోకజ్ఞానం లేని వారు , నేను లేకుంటే
మా సంస్థ లేకుంటే ఏది జరుగదూ అనీ
పొగరుతో వగరుతో వ్యవహారించే
వారందరికీ జ్ఞానబోధ చేస్తుంది!

కలిసి ఉంటే కలదు సుఖం
కలిసి పని చేస్తే విజయం తధ్యం
సమన్వయంతోనే లక్ష్యం సాధ్యం
పశ్చాత్తాపానికి మించి‌న ప్రాయశ్చిత్తం లేదు!
 

No comments: