Wednesday, July 16, 2025

చిరు దివ్వె

అంశం: సూక్తి కి పద్యాలు

ప్రక్రియ: ఆ.వె:పద్యాలు

శీర్షిక: చిరు దివ్వె

ఆ.వె: 01.
నిశిని తిట్టుకుంటు నిశిలోన కూర్చోకు
చిన్న దీపమనియు మిన్నకుండ
వేగిరముగ దివ్వె వెలిగించు నెటులైన
వెలుగు పంచు నదియె నలుదిశలును!

ఆ.వె:02.
కరువు కాటకములు కష్టము వచ్చిన
బాధ పడకు నెపుడు భయము వీడు
నిశివెనుకనె వెలుగు నిశ్చయముగ వచ్చు
ధైర్యమున్న చాలు దారి దొరుకు!
 

No comments: