అంశం: దుర్గాబాయి దేశ్ ముఖ్ (గేయాలు)
శీర్షిక: ఆదర్శ మహిళ దుర్గా బాయిప్రక్రియ: గేయాలు
జ్ఞాని దుర్గా బాయి దేశ్ ముఖ్ గారు
రామరావు కృష్ణమ్మలకు జన్మించారు
ఎనిమిదవ యేటనే వివాహం చేశారు
దుర్గా బాయి దానిని వ్యతిరేకించారు!
బాల్యం లోనే ప్రతిభను చూపారు
పది సంవత్సరాలకే హిందీ నేర్చారు
హిందీ పాఠశాలనూ నెల కొల్పారు
విద్యార్ధినులకు హిందీ బోధించారు!
మెట్రిక్యులేషన్ చదివి పాసయ్యారు
ఎమ్ ఎ పొలిటికల్ సైన్స్ చదివారు
న్యాయ శాస్త్రంపై పట్టు సాధించారు
న్యాయ వాద వృత్తిని ప్రారంభించారు!
చిన్న నాటే విద్యపై పోరాటం చేశారు
చిన్న నాడే విరాళాలను సేకరించారు
గాంధీకి తన గాజులతో సహా ఇచ్చారు
స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు!
కళాశాలలు వృత్తి కేంద్రాలు స్థాపించారు
అనేక సేవాకార్యక్రమాలలో పాల్గొన్నారు
మంత్రి చింతామణిని వివాహ మాడారు
గొప్ప పద్మభూషణ్ అవార్డును పొందారు!
No comments:
Post a Comment