Tuesday, July 8, 2025

అంతరిక్షంలో అవశేషాలు

అంశం: స్వేచ్ఛా కవిత


శీర్షిక: *అంతరిక్షంలో అవశేషాలు*

దూరపు కొండలు నునుపు
కానీ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది దాని మెరుపు
అక్కడ ఉన్న రాళ్ళు రప్పలు ముళ్ళ కంచెలు
ఎత్తెన తరువులు పాములు తేల్లు ఖడ్గమృగాలు

దూరపు ఆకాశం అంతరిక్షం ఎంతో అద్భుతం
కానీ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది విచిత్రం
అక్కడ పడి ఉన్న చెడిపోయిన రాకెట్ల
అంతరిక్ష నౌకల పాడయిపోయిన
విడిభాగాలు శకలాలు శిధిలాలు

మ్రింగ లేక కక్క లేక అన్నట్లు చంద్రమండలం
వెళ్ళలేక భూమండలం రాలేక అక్కడక్కడే
తిరుగాడుతూ ప్రపంచ సాంకేతిక విజ్ఞానానికి
నేడు అవి సవాళ్లు విసురుతున్నాయి

భూమి నుండి కొన్ని వేల మైళ్ళ దూరంలో
గాలి ఉండదన్నది జగమెరిగిన సత్యం
ఆ కారణంగానే రాకెట్ల నుండి విడిపోయిన
శిధిలాలు భూమి మీద పడలెక పోతున్నాయి
మరో గ్రహానికి వెళ్ళలేక పోతున్నాయి

ఇవి ఇలాగే పెరిగి పోతుంటే
కొత్తగా పంపే రాకెట్లకు అంత రిక్షనౌకలకు
అడ్డు తగలవచ్చు ప్రమాదకరంగా మారవచ్చు
లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లవచ్చు

మానవులు చేసే వికృత గ్లోబల్ చర్యల వలన
వాతావరణంలో మార్పులు సంభవించి
గాలిలో తేడాలు వస్తే రాకెట్ల శకలాలు
భూమి మీద పడవచ్చు ప్రాణ నష్టం ఆస్తుల
నష్టం జరుగవచ్చు

తక్షణమే రోదసీ లో  తచ్చాడే బరువైన
విడిపోయిన రాకెట్ల విడి భాగాలను
చెడిపోయిన శిధిలాలను
అంతరిక్షంలోని అవశేషాలను
సముద్రాలలో పడేటట్లు చేయాలి
దీనికి ఐక్యరాజ్యసమితి చర్యలు చేపట్టాలి!
 

No comments: