Wednesday, July 9, 2025

పుట్టుక పరమార్థం

అంశం: పుట్టుక పరమార్థం


శీర్శిక: ఆదర్శవంతమైన జీవితం

మనిషీ జన్మిస్తాడు పశువూ జన్మిస్తుంది
కానీ జ్ఞానంలో అవగాహనలో మాటలో భాషలో
పశువుకు మనిషికి నింగికి నేలకున్నంత తేడ
మనిషిగా పుట్టినందుకు ఒక అర్ధం ఉండాలి
అలానే ఒక పరమార్థం సార్ధకత ఉండాలి!

నీతి నిజాయితీ మంచి నడవడికతో
మాట తీరు మాటకు కట్టుబడి ఉండటం
ఎదుటి వారి పట్ల సమభావం
పెద్దల పట్ల గౌరవం పిల్లల పట్ల ప్రేమ
హద్దులు దాటకుండా ప్రవర్తించడం!

క్రమశిక్షణతో జీవించడం
శుచి శుభ్రతతో సమాజ హితం కోరడం
సత్ప్రవర్తన సజ్జనులతో సాంగత్యం
తోటి వారికి చేతనైన సహాయం చేయడం
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం
అందరితో ప్రేమానురాగాలు కలిగి ఉండటం
అరిషడ్వర్గాలైన కామక్రోధ లోభ మోహ
మదమాత్సర్యాలను అదుపులో ఉంచడం!

తోబుట్టువులు ఆత్మీయులు బంధువులతో అనుబంధాలు కలిగి ఉండటం
అతిథులను ఆదరించి సపర్యలు చేయడం
భార్యా భర్తలు అన్యోన్యంగా గడుపుతూ
ఆదర్శంగా జీవించడం
పిల్లలను బాధ్యతగా సక్రమ మార్గంలో
పెంచుతూ విద్యా బుద్దులు నేర్పించడం!

దాన గుణం ధర్మగుణం కలిగి
ఆధ్యాత్మికత దైవంపై నమ్మకం ఉండటం
తల్లిదండ్రుల వృద్ధుల  అంగవైకల్యుల
మూగ ప్రాణుల పట్ల ప్రేమ దయ చూపడం
వారికి  సపర్యలు చేయడం
గతించిన వారికి కర్మలు చేయడం
రేపటి తరాలకు ఆదర్శవంతమైన జీవితం
గడపడమే పుట్టుక పరమార్థం!
 

No comments: