Friday, July 18, 2025

పండుగలు అమూల్యమైన సంపదలుP

అంశం: పండుగల పరమార్థం 

శీర్షిక:  పండుగలు అమూల్యమైన సంపదలు 

భారతీయతకు ప్రతీకలు పండుగలు
సంస్కృతి సాంప్రదాయాల వారధులు
ఆచార వ్యవహారాల రథసారధులు
రేపటి తరాలకు వెలకట్టలేని సంపదలు!

సంస్కృతి అనే ఇంద్రధనుస్సులో
పండుగలు తళతళ మెరిసే సప్తవర్ణాలు
సంస్కృతి అనే ప్రకృతిలో
పరిఢవిల్లిన పరిమళ సుగంధాలు!

కుటుంబ సభ్యుల కలయికలు
సంతోషాలు ఆనందాలు అనుభూతులు
ప్రేమలు బంధాలు అనుబంధాలకు
అనురాగాలు ఆప్యాయతలకు
ఉత్సాహాలకు ఉల్లాసాలకు
ప్రతిబింబాలు మన పర్వదినాలు!

ఉగాది సంక్రాంతి దసరా
దీపావళి బతుకమ్మ బోనాలు హోళీ
వినాయక చవితి రంజాన్ బక్రీద్
క్రిస్టమస్  మరెన్నో పండుగలు
చీకటి ని తరిమేసి వెలుగును నింపి
దేశ సంస్కృతిని కాపాడే ఆశా దీపాలు!

పండుగలు ఆరోగ్యాన్ని ఆయుష్షును 
దైవంపై భక్తిని నమ్మకాన్ని పెంచును
పర్యావరణాన్ని కాపాడును
వైశమ్యాలను దూరం చేసి
మనసుకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్నిచ్చును
సమస్యలకు పరిష్కార మార్గం చూపును
గౌరవ మర్యాదలకు సంస్కారాలకు
ఐక్యతకు అనురాగాలకు పునాదులు వేయు
భారతీయ సంస్కృతికి పండుగలు 
చిరస్మరణీయమైన చిహ్నాలు!
 

No comments: