Saturday, July 5, 2025

కృష్ణుడి లీలలు

అంశం: భక్తి గేయాలు

శీర్షిక: *కృష్ణుడి లీలలు*

పల్లవి:
చిన్ని కృష్ణా.. ఏమీ నీ లీలలు...
విశ్వమంతా వెతికినా కానరావు...
గొల్ల భామలొచ్చి గోలచేసిరీ..
వెన్న దొంగిలించావని చెప్పిపోయిరి.... "చిన్ని"

చరణం:01
దేవకీ వసుదేవుల అష్టమ సంతానంగ...
కంసున్ని సంహరింప....
దుష్ట శిక్షణ శిష్టరక్షణ జేయ....
అవతరించావు అవనిలోన....          "చిన్ని"

చరణం:02
కంసుడు పంపగా వచ్చిన...
రాక్షసి మాయావి పూతన...
విషపు చనుబాలు ఇచ్చి చంపజూసే...
పిడిగుద్దులు గుద్ది హతమార్చినావూ..   "చిన్ని"

చరణం:02
గొల్లభామల ఇండ్లకెళ్ళీ ....
వెన్న దొంగిలించావట...
వలదు తనయా నీకు తగదు కన్నా...
అమ్మ మాట వినవా నా ముద్దుల కృష్ణా...   "చిన్ని"

చరణం:03
మన్నుతిన్నావని కోపగిస్తే...
నేను తినలేదనీ బొంకితివి.....
నోరుచూపమని గద్దిస్తే....
విశ్వరూపం చూపితివీ కృష్ణా.....            "చిన్ని"


_ మార్గం కృష్ణ మూర్తి

No comments: