Thursday, July 31, 2025

నిత్యం మధు మాసమే

*నేటి అంశం*కవితా పూరింపు*

*ఇరువురి మనసులు ఏకమై*
*ప్రేమ గృహం లోకి ప్రవేశించి*
*కష్టసుఖాలు పంచుకుంటూ*
*కలకాలం సాగేదే కదా సంసారం*

శీర్షిక: నిత్యం మధుమాసమే

*ఇరువురి మనసులు ఏకమై*
*ప్రేమ గృహం లోకి ప్రవేశించి*
*కష్టసుఖాలు పంచుకుంటూ*
*కలకాలం సాగేదే కదా సంసారం*!

భార్యా భర్తలు ఒకరిపై ఒకరు నమ్మకంతో
ఒకరిపై ఒకరు గౌరవంతో ప్రేమతో
అనురాగంతో ఆత్మీయతతో కోపతాపాలు
దాపరికాలు లేకుండా జీవనం సాగిస్తే
నిత్యం మధు మాసమే కదా!

"నీటిలో పడవ ప్రయాణించాలి గానీ
పడవలోకి నీరు చేరనీయకూడదు"
సమాజంలో సంసారం సాగాలి గానీ
సంసారం లోకి సమాజాన్ని రానీయకూడదు!      

ఒకరి అమ్మా నాన్నలు తోబుట్టువులతో
మరొకరు ప్రేమతో సానుకూలంగా ఉంటే
అనేక సమస్యలు మటుమాయం
చిన్న చిన్న ఇక్కట్లు రావడం సహజం
వాటిని సర్దుబాటు చేసుకోవడం సరైన నిర్ణయం!
 

No comments: