అంశం: క్రమశిక్షణ - గేయాలు
శీర్షిక: పిల్లల పెంపకం - తల్లి తండ్రుల బాధ్యతనేడు కష్ట పడినచో రేపు సుఖము
ఏదైనా ఇష్టపడి పని చేసినను విజయము
అతి గారాబం అనర్ధదాయకము
అది ఆనందదాయక జీవితానికి విఘాతము!
మా నాన్న కడు పేదరికంలో జీవించాడనీ
మమ్మలను చదివించ లేక పోయాడనీ
మా పిల్లలను కష్ట పడకుండా పెంచాలనీ
కాళ్ళకు ముళ్ళు గుచ్చుకోకుండా పెంచకండీ!
అదే పిల్లల కోసం పెద్దలు చేసే పెద్ద తప్పు
తప్పు అనుకోకుండా చేస్తున్నారు పెద్ద అప్పు
అప్పు అవుతుందనుకోవడం లేదు ముప్పు
ముప్పు అయినా నమ్ముతున్నారు అది ఒప్పు!
బుద్దుడి వలే దయ కరుణను బోధించాలి
రాముడి వలే నీతి ధర్మం సహనం నేర్పాలి
జిజియాబాయిలా క్రమశిక్షణ ధైర్యం నేర్పాలి
తాము పడ్డ కష్టాలను బాధ్యతలను చెప్పాలి!
No comments:
Post a Comment