Tuesday, July 22, 2025

బలహిన సమాజం

 అంశం:బలహీన సమాజం


శీర్శిక: బలమైన సమాజంగా మారాలంటే!

బలమైన వారిదే రాజ్యమైనప్పుడు
స్వార్ధపు నేతలే రాజ్యమేలినప్పుడు
ధనవంతుల మాటే చెల్లుతున్నపుడు
చట్టాలు వారికే అనుకూలంగా ఉన్నపుడు
సమాజం బలహీన పడుతుంది!

ప్రజలు ఉచితాల కొరకు ఆశపడినప్పుడు
జనులు సోమరులుగా మారిపోయినపుడు
యువత బానిసత్వానికి ఇష్టపడినప్పుడు
బానిసత్వ సమాజమే ఏర్పడుతుంది!

స్వేచ్చా వాయువులు పీల్చడం
ఏడు దశాబ్దాలు గడిచినా
అధిక విద్యా వంతులైనా
ప్రభుత్వ సంక్షేమ పధకాలను
చేజిక్కించుకోడానికి హీనంగా దీనంగా
కనపడాలనీ
ఉచితంగా వచ్చే వాటిని ఎందుకు వదులుకోవాలన్నా
సమాజం బలహీనంగా తయారవుతుంది!

ఒక రాయి గుండు ఉంది
దానిపైన స్వార్ధ రాజకీయ నాయకులు
కుబేరులు బలవంతులు ధనవంతులున్నారు
క్రింద గుండు చుట్టూ ప్రజలు ఉన్నారు
పైనుండి కల్తీ జిగురు పానకాలను పోస్తున్నారు
జనులు త్రాగుతూ జారుతున్న గుండు పైకి ఎక్కడం ఎలా?
వారిని పడగొట్టి ధైర్యంగా నిలబడటం ఎలా?

ఉచితాలపై ఆధారపడి జీవించడానికి
కష్టపడటానికి ఇష్టపడని సమాజం
మేము ఇంకా పేదలమే నని భ్రమ పడేవారు
ధైర్య సమాజంగా మారడం కష్టం!

బలమైన సమాజంగా మారాలంటే
స్వాభిమానం పెంచుకోవాలి
కోరికలు అత్యాశ తగ్గించుకోవాలి
విద్యను పెంచుకోవాలి
ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి
ఉచితాలకు దూరంగా ఉండాలి
అడుగడుగునా అవినీతిని ప్రశ్నించాలి!

No comments: