*అంశం*పదాల కవిత*
*పలుకే బంగారమా* *మనసు పలికే వేళ**కలల కాలంలో* *మెరుపులా మెరిసావు*
శీర్షిక: * నా హృదయంలో..*
నిండు పున్నమి రోజున చందమామ
వెదజల్లే చల్లని కాంతులు
గులాబీ తోటలో పరిమళాలతో
గుభాలించే పువ్వులు
గలగలా పారే నిండు గౌదావరిలా
వినిపించే నీ నవ్వులు
నేడు *పలుకే బంగార మా* యె నా!
ఊసులెన్నో చెప్పావు ఆశలను పెంచావు
గిలిగింతలు పెట్టావు చెక్కిలి గింతలు చేశావు
సుడిగుండంలో ఉన్న నా మనసును
ఓం దరికి చేర్చావు
*నా మనసు పలికే వేళ* కనుమరుగైనావు!
ప్రియా! పసిఫిక్ మహాసముద్రంలోని
తరంగాలను లెక్కించవచ్చునేమో కానీ
పడతి మనసు అంతరంగాలను పసిగట్టడం
ఆ బ్రహ్మకే సాధ్యమేమో
ఇంత కాలం నేను నీతో గడిపినది
*కలల కాలంలో* నే నా !
కుంభ వర్షం కురిసే వేళ ఆకాశంలోన
ఉరుములు మెరుపుల వలె
వర్షం తరువాత ఏర్పడే సప్త వర్ణాల
ఇంద్రధనుస్సు వలె
ఒక *మెరుపులా మెరిసావు* నా మనసులో
పదిలంగా నిలిచి పోయావు నా హృదయంలో!
No comments:
Post a Comment