Tuesday, July 15, 2025

నేటి సమాజం తీరు

అంశం: స్వేచ్ఛా కవిత


శీర్షిక: *నేటి సమాజం తీరు*

కోకిల , కోకిల పిల్లల గురించి గూళ్ళ గురించి
ఎన్ని రాగాలైనా పాడుతుంది...

ఎందుకంటే వాటి బరువు భారం మోసేది కాకులు కాబట్టి...

జీవితంపై విరక్తి చెందినా సమస్యలు ఎదురైనా  విమర్శిస్తుంటారు....

కంఫర్టబుల్ జోన్ లో ఉన్న వారు గొప్పలు మాట్లాడుతుంటారు....

రెండింటినీ అధిగమించిన వారు వేదాంతం చెబుతుంటారు....

సమాజంలో ఉనికి కోసమే నీతులు, పాటించడంలో తప్పటడుగులు ...

ఏ తప్పూ చేయలేదని ఇవ్వరూ హామీ, రేపు ఏ తప్పూ చేయనని చెప్పరూ పోనీ....
 
కొక్కు పట్టిన కోళ్ళు ఎన్ని కూతలైనా కూస్తాయి ఎన్ని రాగాలైనా తీస్తాయి....

ఒక్క వ్రేలుతో ఒరులను నిందింప వెక్కిరించు నిన్ను నీ మూడు వ్రేళ్ళు.....

దూరపు కొండలు నునుపు  దగ్గరికి వెళ్తే తెలుస్తుంది దాని మెరుపు...

ముప్పది ఐదవ పెళ్లిలో తెలిసింది ఒక అమ్మడి మోసం...

సరదాగా అని చెప్పి రేప్ చేసి పడేశారు రాణులు శ్రీశైలం అడవులో అమాయకుడిని..

స్త్రీకి సానుభూతి అధికం సమాజంలో చట్టంలో పురుషుడికి శూన్యం వ్యవస్థలో...

పెళ్ళైన సంవత్సరానికే నరకం చూపిస్తున్నారు వరులకు, డబ్బు కొరకు విడాకులివ్వకుండా...

పప్పు బెల్లం కలిస్తేనే బొప్పట్లు, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు....

తప్పులు స్త్రీ పురుషుల లోనూ ఉన్నాయి
ఒకరినే నిందించడం సరికాదు....

నిన్నటి ప్రత్యూష ధారుణ హత్యలోనూ మరో స్త్రీ హస్తముంది కదా...

నింగిలో సూర్యచంద్రులు ఉన్నంత కాలం భూమిపైన చీకటి వెలుగులు ఉంటాయి...

నేలలో మనుష్యులకు ఆకలిదప్పులు  ఉన్నంత కాలం సుఖదుఃఖాలు పాపపుణ్యాలు ఉంటాయి....

వీటి అన్నిటికీ పరిష్కార మార్గం ఇతిహాసాలు, భగవద్గీతలను పాఠశాలలో బోధించడమే.. 

No comments: