Saturday, July 19, 2025

లలిత గేయాలు - విరహ వేదన

అంశం: లలిత గేయాలు


శీర్షిక: విరహ వేదన

పల్లవి:
ఓ.... రాధా... రావా.....
నా ...సేద తీర్చ రావా...
మనసు లేక నీవున్నా...
మరువ లేక నేనున్నా...
మమత లేక నీవున్నా...
సమత నిండి నేనున్నా....            "ఓ రాధా.."

చరణం:01
ఊసులెన్నో చెప్పావు...
ఆశలెన్నో పెంచావు....
కాసులు కంట చూడగానే...
బాసలన్నీ మర్చి పోయావు.....      "ఓ రాధా.."

చరణం:02
ఆస్తులేమైనా శాశ్వతమా....
అందమేమైనా శాశ్వతమా...
ఆయుష్షేమైనా శాశ్వతమా...
శాశ్వతం కాని వాటి గురించి
తాపత్రయం దేనికీ....                          "ఓ రాధా.."

చరణం:03
కలసి తిరిగిన జ్ఞాపకాలు
చెదిరి పోవుననీ తెలియదా...
కలలు గన్న మధుర స్వప్నాలు
అమూల్యమైనవనీ తెలియదా .....     "ఓ.. రాధా.."

చరణం:04
వెచ్చని సూర్య వెలుగులను
చల్లని వెన్నెల రాత్రులును కాలరాచీ...
ఓ విషపు చుక్కను రాల్చిపో...
నేను అమృతంగా  సేవిస్తా.....         "ఓ .. రాధా.."
 

No comments: