Wednesday, July 9, 2025

నీతో నేను/ఆనందం భాష్పాలు

అంశం: *నీతో నేను*


శీర్షిక: *ఆనంద బాష్పాలు*

సృష్టి విచిత్రం
శాశ్వితం ఈ విశ్వం
సూర్యచంద్రులున్నంతకాలం
దేనిని మరువదు ,వదులదు సాహిత్యం!

భూ భ్రమణానికైనా
భూ పరిభ్రమణానికైనా
ఎండకైనా వెన్నెలకైనా
ఉంటుంది కారణం
భూమి తన చట్టూ తాను
సూర్యుని చుట్టూ తిరుగడం!!

సముద్రాల ఆటుపోటులకు
ఝరులు జలపాతాలకు
ఉంటుంది కారణం
పౌర్ణమి అమావాస్యలు
కాలాలో ఋతువుల మార్పులు!

సముద్రాలలో
సుడి గుండాలకైనా
నదులలో వలయాలకైనా
ఉంటుంది కారణం!

సమాజంలో
సమస్యలకైనా
ఆకలి కేకలకైనా
ఆనందోత్సాహాలకైనా
ఉంటుంది కారణం!

వస్తువు
కదులాలన్నా
నీరు పారాలన్నా
మనిషి నడవాలన్నా
కారణం ఉంటుంది!

కన్నీరు కైనా
కారణముంటుంది
మనసు బాధతో నిండుకున్నపుడు
గుండె బరువెక్కి
ద్రవ రూపంలో
కంటి నుండి కారేది కన్నీరు!

ఆనంద భాష్పాలకు
కారణముంటుంది
మనసు అధిక ఆనందంతో నిండినపుడు
పెల్లుబుకుతూ
కంటి నుండి కారే నీరే
ఆనంద బాష్పాలు!

మంటతో  కారే నీటికి
కారణం ఉంటుంది
వర్షంలో తడిచినపుడు
కారే నీటికి కారణముంటుంది!

కారణం లేకుండా వచ్చేది
కన్నీరు కాదు అది కేవలం నీరు!




















No comments: