*అంశం*పదాల కవిత*
*నీలి మేఘాలు* *నవ్వుల పువ్వులు**ఆనంద జ్యోతులు* *మధుర స్వప్నాలు*
శీర్షిక: *తేలి పోదామా!*
అవి హిమాచల్ ప్రదేశాలు
ఎత్తైన దేవదారు వృక్షాలు
ఉత్తరాన చుట్టూరా ఎత్తెన వెండి కొండలు
సుందర నదీతీరాలు అద్భుత జలపాతాలు
నింగిలోన కదలాడే *నీలి మేఘాలు*!
ఆహా! ఏమీ ఆ మనోహర వాతావరణం
ఆకాశంలో సప్త వర్ణాల ఇంద్రధనుస్సు
చల్ల చల్లగా ప్రవహిస్తున్న బియాస్ నదీ జలాలు
కనీవినీ ఎరుగని చేసే *మధుర స్వప్నాలు*!
కనువిందు చేసే కమ్మని పిల్ల తెమ్మరలు
సన్నగా ప్రసరించే సూర్య కిరణాలు
జగతికి వెలుగులు పంచే *ఆనంద జ్యోతులు*
ఆనందాలు సంతోషాల నిచ్చే తీయని వరాలు!
రోతాంగ్ పాస్ మంచు గడ్డలపై
ఒకరికొకరం ఒడిసిపట్టుకుని
జరజరా జారుతూ కేరింతలు కొడుతూ
*నవ్వుల పువ్వులతో* తేలిపోదామా!
No comments:
Post a Comment