అంశం: పండుగ వచ్చింది (బాల సాహిత్యం)
గేయాలుశీర్షిక: బోనాల పండుగ
పండుగ వచ్చిందోయ్
పండుగ వచ్చిందీ
ఆషాఢమాసంలో
అరుదైన పండుగ
అమ్మవారిని కొలిచేటి
బోనాల పండుగ. "పండుగ"
కొత్త కుండలను దెచ్చి
పసుపు కుంకుమల తోటి
చక్కంగా దిద్దియూ
బియ్యం బెల్లం నెయ్యితో
నైవేద్యములను జేసి
ధూపదీపాలతో
సమర్పించుకుంటారు
అమ్మకూ బోనాలు. "పండుగ"
తెలంగాణ ప్రజలకు
ఇష్టమైన పండుగ
డప్పు వాయిద్యాలతో
పోతరాజుల చర్నాకోలాలతో
కొబ్బరికాయలతో
అంగరంగ వైభవంగా
ఆనందంగా గడిపేరు
అమ్మవారిని మొక్కేరు
రక్షించమని కోరేరు "పండుగ"
No comments:
Post a Comment