Wednesday, July 23, 2025

వేదవ్యాసుడు

అంశం:  వేదవ్యాసుడు


శీర్షిక: వ్యాస మహర్షి

సీ.ప:
భారతమురచించె  భారమనక తాను
వేద విభజనతో వినతికెక్కె
ఆషాఢ మాసమ్ము యానందము కురువ
పూర్ణమి రోజున పుడమి తల్లి
పులకరించునటుల పుట్టెను వ్యాసుడు
నిండు పౌర్ణమి రోజు వెలుగు నిండె
గురుపూర్ణిమ దినము గురువునుపూజించ
జ్ఞానము పొందేరు ధన్యముగను!

ఆ.వె:
మత్స్య గంధి తాను మాన్యపరాశర
వలన కలిగి నట్టి వ్యాసుడతడు
జన్మతోడ వెడలె జపముజేయ నదికి
కృష్ణ మాట వినుము తృష్ణ దీర!
 
ఆ.వె:
వేద ధర్మములను వివరముగదెలిపె
జనులకతడు నాడు చక్కగాను
కార్యము నెరవేర్చె గౌరవములపొందె
కృష్ణ మాట వినుము తృష్ణ దీర!


No comments: