Tuesday, July 15, 2025

స్వర్గం నీ చెంతనే ఉంది

అంశం: స్వర్గం ఎక్కడ ఉంది?


శీర్షిక: *స్వర్గం చెంతనే ఉంది*

మనిషి ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా గడిపే స్థలము....

మనిషి ఆహ్లాదకరమైన సుగంధ పరిమళాల వాతావరణంలో ఉండు చోటు...

మనిషి తనకు ఇష్టమైన నమ్మకమైన వారితో కలిసి ఉండే స్థలం...

స్వేచ్చగా తిరుగుతూ ఆడుతూ పాడుతూ గడిపే చోటు స్వర్గమే కదా!...

స్వర్గం అంటూ వేరే ఎక్కడో లేదు అది నీ చెంతనే ఉంది...

స్వర్గం అనేది మనిషి మనసు విస్తీర్ణాన్ని బట్టి ఉంటుంది...

స్వర్గం మనిషి మనసుకు సంబంధించినది తన మనసును బట్టే ఉంటుంది....

మనిషి హృదయం విశాలంగా గొప్పగా ఉంటే
అక్కడ స్వర్గం ఉన్నట్టే....

చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనిషి ప్రేమ తత్వంతో
ఊహించుకుంటూ....

చుట్టూ ఉన్న వారందరూ దేవతలు దేవుళ్ళు అనుకుంటూ...

చుట్టూ ఉన్న ఇండ్లు గుడిసెలు వజ్ర వైడూర్యం పొదిగిన గోపురాలుగా...

చుట్టూ కనబడుతున్న మైదానాలు తోటలు సరోవరాలుగా భావించుకుంటే స్వర్గమే కదా...!

మనిషి మేలు చేస్తే మంచి చేస్తే మంచే తిరిగి వస్తుంది....

మనిషి  హాని చేస్తే చెడు చేస్తే చెడే తిరిగి వస్తుంది...

ఎదుటి వారిని ప్రేమతో పలకరిస్తే ప్రేమనే లభిస్తుంది...

అన్నీ అర్ధం చేసుకుని తృప్తిగా గడుపుతే అది  స్వర్గమే....

కూర్చునే కుర్చీలు  బల్లలు బంగారు ఆసనాలుగానూ...

మంచివారిని ఇంద్రాది దేవుళ్ళు దేవతలు శివపార్వతులు నారద నందులు గానూ..

ఇష్టమైన వారిని దేవకన్యలు నాట్య కత్తెలు గానూ...

మరికొందరిని  బటులుగానూ మనసున తలుచుకుంటూ జీవిస్తే స్వరం నీ చెంతన ఉన్నట్లే....
 

No comments: