అంశం: పదాల కవిత
(మనోహరం, మనోగతం, మురళీరవం, మధుమాసం , మానసం)శీర్షిక: *అందమైన ఓ నా చెలీ!*
అందమైన ఓ నా చెలీ!
వయ్యారం నీ నడక సుందరం నీ సౌందర్యం
అద్బుతం నీ నుదుట సిందూరం
*మనోహరం* హంస రెక్కల వంటి నీ కనురెప్పలు!
ఎందుకో ఆ అలక!
నీలి వెన్నెల కురులను తాకలేదనా
చిగురాకు పచ్చ చీరను ముట్టలేదనా
సముద్ర కెరటాలలా ఎగిసి పడే సొగసులను
పొగడలేదనా
అవునులే స్త్రీల *మనోగతం* తెలుసు కోవడం కష్టమే మరి!
ఓ నా నిచ్చెలీ!
నీ అలక తీర్చ నేనేమి చేయను
*మురళీ రవం* ఊదనా జోల పాట పాడనా
స్వర్గాన్ని నీ ముందుకు తీసుకొనిరానా!
ఓ అరవిరిసిన ప్రియతమా!
ఓహో! అర్ధమైందిలే నీ అలకకు కారణం
వస్తుందిలే ఇక *మధు మాసం*
తీరుతుందిలే నీ సుందర స్వప్నం
తృప్తి నొందునులే నీ *మానసం* !
No comments:
Post a Comment