Friday, July 4, 2025

అమ్మంటే ఇష్టం ఇష్టం (బాల సాహిత్యం -గేయాలు)

అంశం: ఇష్టం ఇష్టం (బాల సాహిత్యం -గేయాలు)


శీర్షిక: *అమ్మంటే ఇష్టం ఇష్టం*

అమ్మంటే ఇష్టం ఇష్టం
నాన్నంటే ఇష్టం ఇష్టం
గురువంటే ఇష్టం ఇష్టం
దేవుడంటే ఇష్టం ఇష్టం!

అమ్మ ఒడి అంటే ఇష్టం
అమ్మ ప్రేమంటే ఇష్టం
అమ్మ లాలనంటే ఇష్టం
ఆమ్మ పెట్టే ముద్దులంటే మహా ఇష్టం!

నాన్న మాట అంటే ఇష్టం
నాన్న బాట అంటే ఇష్టం
నాన్న ధైర్యమంటే ఇష్టం
నాన్న బుజాన ఎత్తుకుంటే మహా ఇష్టం!

గురువు బడి అంటే ఇష్టం
గురువు చదువంటే ఇష్టం
గురువు శిక్షణంటే ఇష్టం
గురువు విద్యా బోధనంటే మహా ఇష్టం!

దేవుడి గుడి ఆంటే ఇష్టం
దేవుడిపై భక్తంటే ఇష్టం
దేవుడి దీవెనలంటే ఇష్టం
దేవుడు ఇచ్చే వరమంటే మహా ఇష్టం!
 

No comments: