Saturday, July 12, 2025

గురువు - గేయాలు

అంశం: గురువు - గేయాలు


శీర్షిక: *గురువే దైవం*

పల్లవి:
గురువే దైవము గురువే శరణ్యము
గురువే ధ్యానము గురువే జ్ఞానము
గురువును మించి లేదు భాగ్యము !

చరణం:01
విద్య నిచ్చెదరు వినయము వీక్షించెదరు
జ్ఞానము బోధించెదరు ధ్యానము నేర్పించెదరు
శిక్షణ ఇచ్చెదరు విచక్షణ పెంచెదరు
అస్త్ర శస్త్రాది కళలను నేర్పెదరు!

చరణం:02
జగతిన అమ్మనాన్నే తొలి గురువు
పరుషు రాముడు ద్రోణుడి గురువు
వశిష్టుడు శ్రీ రాముడి గురువు
ద్రోణుడు కౌరవ పాండవుల గురువు!

చరణం:03
గురువును పూజించిన పుణ్యము కలుగును
గురువును తలచిన మోక్షము వచ్చును 
గురువును ఆరాధించిన కర్మలు వీడును
గురువును స్మరించిన అజ్ఞానము తొలుగును!

No comments: