Wednesday, July 16, 2025

నదీ తీరాన

అంశం: పదాల కవిత

పదాలు:
కలల వెలుగు, కనుచూపు, కడలి
కాల మహిమ, కాగితపు పడవ

శీర్షిక: నదీ తీరాన

నిండు పౌర్ణమి రోజున కడలి నుండి
ఎగిసి పడుతున్న సముద్ర కెరటాలు
తీరాన్ని తాకుతూ తరలి వెళ్తుంటే
ఆ మహోన్నత దృశ్యాలను చూడటం
రెండు కనులు చాలవేమో !

నదీ తీరాన ఇసుక తిన్నెల మీద
రంగు రంగుల గొడుగు గుడారాలు
*కనుచూపు* కు అందనంత దూరం వరకు
పడక కుర్చీలు అందులో సేద తీరుతున్న
నదిలో  విన్యాసాలు చేస్తున్న పర్యాటకుల
సందడితో నదీతీరం మహాద్భుతం!

పిల్లలు *కాగితపు పడవల* ను
నదిలో వేస్తుంటే నీరు వెనక్కి వెళ్తుంటే
వాటితో పడవలు పల్టీలు గొడుతూ
నదిలోకి జారుకుంటుంటే
బాలబాలికల కేరింతలు నింగిని తాకే!

పర్యాటకులు ఆటలు పాటలు
నదిలో ట్రెక్కింగ్ లు విన్యాసాలు
*కలల వెలుగు* లా కన్నుల పండుగలా ఉంది
*అంతా కాల మహిమ*
అది అంతా సృష్టి రహస్యం!


No comments: