Thursday, July 10, 2025

వ్యాస పూర్ణిమ/ గురు పూర్ణిమ

 అంశం: వ్యాస పూర్ణిమ


శీర్శిక:  *గురువులకు గురువు*

అతనొక గొప్ప ఋషి మహర్షి
మహా భారతం భాగవతం రచించిన
వేదాలను సంకలనం చేసిన జ్ఞాని
బ్రహ్మ సూత్రాలను, లక్షకు పైగా
శ్లోకాలను రచించిన యోగి
ఉపనిషత్తులనందించిన ఋషి
భూత భవిష్యత్ వర్తమానం తెలిసిన
గొప్ప మహర్షి
ఋషులలో శ్రేష్టుడు మహా ఋషి
విజ్ఞాన వంతుడు విశ్వగురువు
అతడే వ్యాసుడు  వేదవ్యాసుడు

ఆషాఢ మాస శుక్ల పౌర్ణమి రోజున
పరాశర మహర్షి సత్యవతిల సంతానం ఋషి వేదవ్యాసుడు
గురువులకు గురువైన వ్యాసుడు
పౌర్ణమి రోజున జన్మించినందున
దీనికి *గురు పూర్ణిమ* గానూ
*వ్యాస పూర్ణిమ* గానూ పేరు గాంచినది

గురుపూర్ణిమయే వ్యాస పూర్ణిమ
వ్యాసపూర్ణిమ యే గురు పూర్ణిమ
గురువులకు గురువు విశ్వ గురువును
పూజించు రోజు గురు పూర్ణిమ

గురువు దైవం తో సమానం
అందుకే అంటారు *గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః! గురుస్సాక్షాత్ పరబ్రహ్మా తస్మైశ్రీ గురువే నమః*

*మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ*
అని కూడా అంటారు

జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరువాత
ఆచార్యుడు/ గురువు దైవంతో సమానం
అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే
వారే గురువులు

వ్యాసుడు దత్తాత్రేయుడికే కాకుండా
గురువులకు గురువు విశ్వ గురువు
వశిష్టుడు ,విశ్వామిత్రుడు శ్రీ రాముడి గురువులు
ద్రోణాచార్యుడు కౌరవ పాండవులకు గురువు
పరుశురాముడు భీష్మ కర్ణుల గురువు
శ్రీ రామ కృష్ణ పరమహంస స్వామి వివేకానంద గురువు

అందుకే గురుపూర్ణిమ రోజున
మొదటి గురువులైన తల్లిదండ్రులను
రెండవ గురువులైన ఆచార్యులను పూజించిన
దైవాన్ని పూజించిన పుణ్యం దక్కుతుంది!

No comments: