మెరసం కవితోత్సవం- 2:
అంశం: *అంతర్జాలం - చదువులు*
శీర్షిక: *బడి గంటలు*
ఏమిటీ వైపరీత్యం!
ఏమిటీ కరోనా కర్కశత్వం!
ఏమిటీ ప్రకృతి విలయతాండవం!
బడి గంటలు మూగ బోయే
చదువులన్నీ ఆగ మాయే
విద్యార్ధులకు అంతర్జాలమే దిక్కాయే
అది ఎంతో తలిదండ్రులకు భారమాయే
అరగంట చదువులకు
గంటపాటు వారికొకరు తోడు
ఏ చరవాణి సమస్యలొచ్చినా
ఆ రోజు అంతర్జాలానికి డుమ్మా
అంతర్జాలంపై అవగాహన లేక
అదుపు లేకుండ పోయే పిల్లలపై
టీచరు దగ్గర లేక , ఏమి అనలేదని
అరుచు చుండే పిల్లలు అధ్యాపకులపై
నేర్చింది ఏమీ ఉండదు
చూసి చూసి కళ్ళు పాడవుతుండే
ఆటలు పాటలు, క్రమశిక్షణ లేక పిల్లల
కండరాలు,వ్యక్తిత్వంలో వృద్ధి లేకుండే
అనవసర సైట్లతో చెడిపోతుండే
విధి లేక ఇదియే కొన సాగి పోనుండే
అంశం: *కుటుంబ విలువలు*
శీర్షిక: *వాడి పోయిన వృక్షాలు*
మొఖం
మనిషి వ్యక్తిత్వాన్ని
ప్రతిబింబిస్తే
విలువలు
కటుంబ గౌరవ స్థితిని
ప్రతి బింబించు
నాటి విలువలు నేడు ఏవి?
ఏ కాలపు విలువలు , ఆ కాలమే చెల్లు
ఎవరి చేష్టలు వారికి ఆనంద మిచ్చు
ఎదుటి వారికి ఆగ్రహం తెప్పించు
తరం మారుతుండె , తాతలు అమ్మమ్మలు
నానమ్మలు కనుమరుగవుతుండే
పిల్ల లెప్పుడూ తల్లి తండ్రుల వారసులే
బోధించు వారు లేక, విలువలు వలవులవుతుండే
స్వార్ధం పెరిగే , డబ్బుమీద ఆశ పెరిగే
అందనంత దూరాన ఉద్యోగాలు
యాంత్రిక జీవితాలు, అవే వారి సంతోషాలు
మాట తప్పడాలు , ఓరడ్డాలు , కారెడ్డాలు
నిత్యకృత్యాలు
చరవాణులే , బంధువులు, స్నేహితులు
అంతర్జాలమే అమ్మా , నాన్నలు
గౌరవ మర్యాదలు, ప్రేమాప్యాయతలు కానరావు
ప్రక్క రూములో తలిదండ్రులున్నా ,
ఎదురింట్లో అన్న దమ్ములున్నా
పలుకరింపులు శూన్యం
కరోనా తెచ్చే , మరింత రొష్టు
హాస్పిటల్స్ కు ఫోలేక , శవాల చూడలేక
బయటకు త్రోసేయమని వైద్యులకు తెలిపే
*విలువలు లేని కుటుంబాలు , వాడి పోయిన
వృక్షాలు రెండూ సమానమే*
*విలువలను పెంచుదాం,కుటుంబవ్యవస్థను*
*రక్షించు కుందాం*
అంశం: *ప్రకృతి వేదన*
శీర్షిక: *ప్రకృతి రక్షతి రక్షితః*
ప్రకృతికి మించిన శక్తి
ఈ సృష్టిలో లేదు
మనిషికి మించిన స్వార్ధం
ఈ జీవ కోటిలో కానరాదు
ప్రకృతికి ఆగ్రహం వస్తే ప్రళయమే!
అది గ్రహించ కుంటే జీవరాశి
జలమయమే!
ఓ మనిషీ! నీ అవసరాలకు
ఏమి చేస్తున్నావో తెలుసా!
నీవు విడిచిన వాయువును , మలినాలను
స్వీకరించి , పరిశుద్ధమైన పచ్చని చెట్లను
నరికి రోడ్లను వేస్తున్నావు , బంగళాలు
కడుతున్నావు
వాటి మానాన అవి పారుకుంటూ పోయే
నదులను , చెరువులను కలుషితం చేస్తున్నావు
పంటల్లో మందులు వేసి పండిస్తున్నావు
భూములను త్రవ్వి గనులు తీస్తున్నావు
నదులలో ఇసుకను తోడుతున్నావు
యుద్దాలు చేసి కాలుష్యం చేస్తున్నావు
ప్లాస్టిక్ సృష్టించి ప్రకృతిని పాడు చేస్తున్నావు
రంగుల పానీయాలు, ఫలాలలో పౌడర్లు
పరిశ్రమల ద్వారా చెడు రసాయనాలు బయటకు వదులు తున్నావు
వాటి ప్రతిఫలం నేడు అనుభవిస్తున్నావు
మంచి నీరును కొంటున్నావు
ఆక్సీజన్ కొరకు అంగలారుస్తున్నావు
కలుషిత నీరు, గాలి, వైరస్ లతో సతమతమై
ప్రాణాలు విడుస్తున్నావు
భూమాతను కలుషితం చేస్తున్నావు
ప్రకృతిని రక్షించు , ఆరోగ్యంగా జీవించు
*ప్రకృతి రక్షతి రక్షితః*
అంశం: *చిన్ననాటి జ్ఞాపకాలు*
శీర్షిక: *గోలీలాటలు*
చిన్ననాటి జ్ఞాపకాలు ఒకటా రెండా
చెప్పుకుటూ పోతే బోలెడు
గ్రామీణ ప్రాంతం , చల్లని వాతావరణం
చిన్న నాటి జ్ఞాపకాలు మరుపు రానివి, మధురమైనవి
పల్లె వాసుల ప్రేమలు , ఆప్యాయతలు
మరువ లేనివి , మరువ రానివి
రారా పోరా అనే పలకరింపులో ,
ఎంతో అనురాగం, ఎంతో ధైర్యం ఉంటుంది
చెప్రాసి బరిగే తీసుకుని వస్తున్నాడంటే
చెక్క పలక , బలపం పట్టుకుని రడీ
గోలీలాట , సిర్రగోనే , పత్తాలు , కోతికొమ్మచ్చి
చెరువుల్లో , బావుల్లో ఈత కొట్టడం , ఆలోచనలను సిగరెట్టు పెట్టెలపై వ్రాసుకోవడం , నిత్యకృత్యాలు
హైస్కూలుకు 3 కి.మీ.నడకనే
ఒక్కో సారి చెప్పులు కూడా ఉండవు
వచ్చే టపుడు పోయేటపుడు , దారిలో
కంపను , చిన్న చిన్న రాళ్ళను తీసేయడం
ఇతరులకు గుచ్చు కోవద్దని
రాత్రి కాగానే గ్రామస్తులు వస్తే
దీపం బుడ్డి వెలుతురులో ఉత్తరాలు
చదువడమో , వ్రాయడమో ఆనవాయితీ
భోజనమయ్యాక , 8 గం.లోపే నిదుర
ఉదయం కోడి కూయగానే లేచి కాలకృత్యాలు తీర్చుకుని
గద్దెల మీద కూర్చుని , హోమ్ వర్కు
చేసు కోవడం
ఇంటి పనులుంటే చూసుకోవడం
టిఫిన్ పట్టుకుని స్కూలుకు బయలు దేరడం
షరా మామూలే
గ్రామస్తులు ఇచ్చిన విలువ గౌరవం , వెల కట్టలేనివి
అంశం: *గురువు*
శీర్షిక: *మార్గదర్శకుడు*
గురు బ్రహ్మ, గురు విష్ణు
గురు దేవో మహేశ్వరహ |
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః ||
గురు శిష్యుల అనుబంధం
అద్భుతమైనది , అనంతమైనది
గురు శిష్యులకు ఒకరిపై ఒకరికి
నమ్మకం , గౌరవం ఉంటేనే ,
అది కల కాలం నిలుస్తుంది
లోకంలో ఎందరో గురువులున్నారు
అందరూ నిజమైన గురువులు కారు
గురువంటే అజ్ఞ్యానందకారం నుండి
జ్ఞ్యానమార్గం నడిపించు వారే గురువు
ఏమి ఆశించ కుండా ,
నిస్వార్ధ ప్రేమతో
నిర్మలమైన మనసుతో
విశాల హృదయంతో
శిష్యుడి అభివృద్ధికి పాటు పడే
నిత్య విద్యార్థే గురువు
నిరాశతో ఉన్నవారికి
నిస్పృహతో నున్న వారికి అభయమిస్తూ
నేనున్నాని వెన్నుతట్టి ప్రోత్స హిస్తూ
ఉత్సాహం నింపుతూ
ఒక ప్రయోజకుడిగా మార్చే
మార్గ దర్శకుడే గురువు
అవహేళన చేయ కుండా
అహం పెంచు కోకుండా
శిష్యుడి యెదుగుదలను కాంక్షిస్తూ ,
తరిస్తూ , పరవశిస్తూ , ఆనందిస్తూ
జ్ఞానాన్ని అందించు వారే నిజమైన గురువు
అంశం: *మాతృమూర్తి*
శీర్షిక: *అమ్మ ఒక స్వర్గ సీమ*
*అమ్మ*
*సృష్టికి మరో బ్రహ్మ!*
*అమ్మ ఒక దేవత*
*అమ్మ ఒక స్వర్గ సీమ*
*అమ్మ ఒక అమృత భాండాగారం*
*అమ్మా*... అనే పిలుపు కొరకు
తల్లి ఆశపడే!
సృష్టి కర్తను
కావాలన్న తపనను తాను వీడలేక!
తొక్కని గుడి మెట్లు లేవు
చేయని పూజలు లేవు
తల పెట్టని వ్రతములు లేవు
పూజలు ఫలించే ,కడుపులో బిడ్డ పెరగసాగే
జోపుచ్చుకుంటు , మనసెరుగుకుంటూ
కంటికి రెప్పలా కడుపులో పెంచసాగే
నవమాసాలు నిండాక, సృష్టించే పండంటి బాబును
బాబూ కేరింతలతో కనులు చెమ్మగిల్లే
ఆనంద భాష్పాలు జల జలా నేల జారే
ఆనందానికి అవధులు లేకుండా పోయే
పురిటి నొప్పులు గుర్తుకు రాలే
ఆకాశంలో విహరిస్తూ , సంతోషంతో పరవశించే మాతృమూర్తి , సృష్టికర్త
గుండెన హత్తుకుని , మేనుని నిమురుతూ
చనుబాలను యిస్తూ, ముఖాన ముద్దులు పెడుతూ , ఆ అమ్మ మురిసి పోయే,
ఆ అపురూప కొడుకును చూసి
కంటికి రెప్పలా పెంచుతూ ,
లాలించే జోల లాడించే , బుజ్జగించే
అమ్మా అమ్మా అని పిలుస్తుంటే
ఎంతో పొంగి పోయే ,నింగి నెగురుతున్నట్లు
అల్లారు ముద్దుగా అలరించ సాగే
పెంచి పెద్దచేసి , విద్యా బుద్దులు నేర్పించే
ఉద్యోగం చేయించే ,
అందమైన అమ్మాయి కొరకు వెతికి పెండ్లి చేసే
పెద్ద ఉద్యోగమంటే, సరే ననీ విధిలేక
అమెరికా పంపించే
అమెరికా నుండి కొడుకు డాలర్ల పంపుతుండే
కాలం హాయిగ గడవ సాగే
ప్రతి రోజు వీడియో కాల్ మాట్లాడుతూ
ఆనందంతో పొంగి పోయే
అది ఎంతో కాలం నిలువ లేదు
అమ్మకు వృద్ధాప్యం ఆవహించే
అమెరికా వెళ్ళలేకుండే , ఇండియాలో చేసుకోలేకుండే
అమ్మ కోరిక మేరకే , పనిమనుషుల పెట్టి
ఇంట్లోనే ఉంచే
*కన్న తల్లిని, పుట్టిన దేశాన్ని విడిచి*
*వెళ్ళ వద్దని ఆ అమ్మ చెప్పలేక పోయే*
ప్రేమ ఉన్నను కొడుకు రాలేక పోయే
కరోనా వలన చివరి రోజున ఆ తల్లి
కొడుకు పిలుపుకు , నోచు కోలేక పోయే
శీర్షిక: *చిన్న ఆశ*
కొడుకుల్లారా! బిడ్డల్లారా!
మీరు ప్రశంసిస్తున్నట్లే ,
నేను మీ అమ్మను , మీ మాతృమూర్తిని
మీ బంగారు తల్లిని , మీ అమృతాన్ని
మీ సృష్టి కర్తను. మీ బ్రహ్మను
మీ ఆత్మీయ దేవతను , మీ కల్పవల్లిని
మీ త్యాగశీలిని , ఏ స్వార్ధం లేని క్రొవ్వొత్తిని
మీ ఆశల పల్లకిని , మీ అను రాగ ప్రేమ మూర్తిని
నాకు ఈ రోజు గుండె నిండా , చాలా సంతోషం
నా గురించి ఒక రోజు కెటాయించి నందుకు
పుట్టినరోజు,జరుపుతున్నందుకు
మీ ప్రశంసా పత్రాలకో ,
మీ బహుమతుల కొరకో
పేపర్లలో అచ్చు అవుతుందనో
చాలా లైకులు వస్తాయనో
నన్ను పొగడటానికి ,
నాపై ప్రేమ ఉన్నట్లు నటించడానికి
తెలిసిన పదాలే కాకుండా ,ఇతరులను అడిగి
గూగుల్ సెర్చ్ చేసి , మరీ ప్రస్తుతిస్తున్నారు
మీ పాట్లను చూస్తుంటే, నాకు ముచ్చటేస్తుంది
ఆనందంగాను ఉంది
ఒక సారి వెనక్కి చూస్తే ,
కొంత కాలం గాంధీ భవన్ దగ్గర
ఎండలో కూర్చోబెట్టి ,
వచ్చిన డబ్బులు కాజేస్తిరి
అతి కష్టం మీద పెద్ద మనుష్యులతో చెప్పిస్తే
నేనేమి చేయాలమ్మా ,
నా భార్యవద్దంటుందని అంటిరి
అతి కష్టం మీద ఒక అమ్మాయితో
ఫోన్ చేయిస్తే ,తమ్ముడితో మాట్లాడి
తరువాత ఫోన్ చేస్తానని అంటిరి
అతి కష్టం మీద ఎదురింటి అబ్బాయితో
ఫోన్ చేయిస్తే , ఆశ్రమంలో ఉంచాము
డబ్బులు కడుతున్నాము కదా అంటిరి
విధి లేక ఒక సారి ఇంటికొచ్చి ,
మీ కుక్కకు పెట్టే అన్నం తిని ,
మీ వద్దే ఉండి మనుమలు , మనుమ రాండ్లతో
కలిసి జీవిస్తామని ధీనంగా బ్రతిలాడితే
మా దగ్గర జాగలేదు , మా పిల్లల చదువులు
దెబ్బ తింటాయంటిరి
సరే నా పెన్సన్ తీసుకునే
ఇంత తిండి పెట్టమంటే
దిక్కున్న కాడ చెప్పుకో పో
అని ఎ.టి.ఎమ్ కార్డ్ గుంజుకుని
గెంటేస్తిరి
శ్మశానం వద్ద పడేసి , పిచ్చిదై
తిరుగుతుందని చెబితిరి
రేపు మీరు పండుటాకుల
మవుతామన్న యావ మరిచితిరి
నాకుఈ రోజు ఎందుకో
చాలా సంతోషంగా ఉంది
మీలో ఇంత మార్పు ఎలా వచ్చిందో నని
ఇలాంటి కవితల పోటీలు రోజూ జరుగుతే
రోజూ ప్రశంసా పత్రాలు
మధర్స్ డే లు రోజూ జరుగుతే బాగుండని
మీలో నిజంగానే , వృద్ధ తల్లి దండ్రులపై
జాలి పుడుతుందనీ, జాలి పుట్టాలనీ
తల్లి దండ్రులను , తమ వద్దే ఉంచుకుని
పోషిస్తారని *చిన్న ఆశ*
అంశం: *గూగుల్*
శీర్షిక: *భూతల స్వర్గం*
గూగుల్!
అదో జ్ఞాన లోకం
అదో విజ్ఞాన లోకం
అదో వింత లోకం
అదో మాయా లోకం
పుణ్యాత్ములకు స్వర్గలోకమైతే
పాపాత్ములకు నరక లోకం,
విజ్ఞానులకు ,అజ్ఞానులకు
గూగులే లోకం
భూలోకానికి , గూగుల్ లోకానికి
ఉంది ఏదో అవినాభావ సంబంధం
గూగుల్ లేకుండా మనుషులుండలేరు
మనుషులు లేకుండా గూగుల్ మనలేదు
భూలోకంలో ఎన్ని ఉత్పత్తులున్నాయో
గూగుల్ లోకంలో అన్ని ఉత్పత్తులున్నాయి
జీ మేయిల్ , యూట్యూబ్ ,జూమ్ మీట్,
బ్లాగ్ , డ్రైవ్ , నోట్స్ , ఫోటోస్ గ్యాలరీ,
జి.పి.ఎస్ అన్నీ గూగుల్ ఉత్పత్తులే
మూడేళ్ళ పిల్లల నుండి, పండు ముసలి వరకు
గూగుల్ సెర్చ్ లేకుండా , ఉండలేని స్థితి
ఆటో నడిపే వారి నుండి ,
సాటిలైట్ ప్రయోగింంచే వారి వరకూ
గూగుల్ మ్యాప్ లేకుండా ,ఉండ లేని స్థితి
కిరానా కొట్టు వారి నుండి
బ్యాంకింగ్ వరకూ
గూగుల్ సర్వీసులు లేకుండా ,ఉండ లేని స్థితి
గూగుల్ అనేది రెండు వైపులా
పదునైన కత్తి వంటిది
పండు కోసుకుని తింటారా
లేక ప్రాణం తీస్తారా మనిషి ఇష్టం
భూలోకంలో సిటీలో తిరగాలంటే పాసుండాలి
గూగుల్ లోకంలో తిరగాలన్నా పాసుండాలి
అదే వైఫై నెట్ కనెక్షన్
భూలోకంలో తిరుగడానికి , ఎన్నోసర్వీసులు
నెట్ కనెక్షన్ కూ , ఎన్నో రకాల సర్వీసులు
నిజానికి గూగుల్ ఒక ప్రాణం
కమ్యూనికేషన్ వ్యవస్థకు మూలాధారం
గూగుల్ లేకుండా జీవించడం కష్టం
అందుకే , గూగుల్ ఒక భూతల స్వర్గం
దేనిని పరిశోధించినా , క్షణాల్లో చెప్పేస్తుంది
ఒక ప్రశ్నకు , వేయి జవాబుల సూచిస్తుంది
విజ్ఞానం పెంపొందుటకు తోడ్పడు తుంది
చెడు మార్గంలో నడవడానికి
దోహదం చేస్తుంది
అందుకే , గూగుల్ ఒక మాయా లోకం
మంచిని ఆలోచిద్దాం ,
మానవ మనుగడకు, ఉపయోగించుకుందాం
అంశం: *స్వాతంత్రోధ్యమంలో నాకు*
*నచ్చిన జాతీయనాయకుడు*
శీర్షిక: *మన్యం దొర*
అతి పిన్న వయస్కులు
అత్యంత నిరుపేదలు
అక్కడ అరకొరా వనరులు
కొండ గుహల్లోనే విన్యాసాలు
అయితే నేమి
అతనొక మహోజ్వల శక్తి
అంత కంటే మిన్నగా యుక్తి
ఏదో సాధించాలనే ఆసక్తి
అందుకు తోడయ్యే మనోశక్తి
అల్లూరి వెంకట రామరాజు
సూర్య నారాయణమ్మల ముద్దుబిడ్డ
బాల్యమంతా పేదరికమే
చదువులోను వెనుక బాటు తనమే
పిన్నాన్నే పోషించే వారి చిన్ననాట
బడిని వదిలేసితిరిగే, మన్యం అడవులలో
కొండగుహలలో , కొండ కోనలలో
గమనించే ఆది వాసీల స్థితి గతుల
కలిసి పోయే వారి బ్రతుకుల
సకల యుద్ధ విద్యలు నేర్చే నచట
నాటి బ్రిటిష్ పాలకుల ఆగడాలు
ఏజెన్సీలపై వారి అరాచకాలు
హింసలు , స్త్రీలపై అత్యా చారాలు
చెప్పా నలవి కాదు , ఆ వికృత చేష్ఠలు
బ్రిటిష్ సామ్రాజ్యంపై ఉక్రోషం రగిలింది
*మన్యం దొర* సమర శంఖం మ్రోగింది
ఏజెన్సీ వాసుల, నిరుపేదల దండు కదిలింది
సాయుధ పోరాటం సాగింది
స్వాతంత్ర్య పోరాటం మొదలయ్యింది
మల్లు దొర , గంటం దొరలతో
పటిష్టమైన సైన్యంతో ,
పోలీస్ స్టేషన్ల కొల్లగొట్టే
బ్రిటిష్ పాలకులతో పోరాడే
కిరాత సైనికుల మట్టుబెట్టే
యేటి ఒడ్డున స్నాన మాచరిస్తుండ
పశువుల కాపరితో పసిగట్టి
బ్రటిష్ సైన్యం చుట్టు ముట్టే
27 యేండ్లకే అసువులు బాసే
స్వాతంత్ర్య సమర యోధుడు,
మన *అల్లూరి సీతారామరాజు*
అంశం: *కర్తవ్యం*
శీర్షిక: *బాధ్యత*
ఓటు హక్కు అని
విద్యా హక్కు అని
స్వేచ్చగా జీవించే హక్కుఅని
స్వేచ్చగా మాట్లాడే హక్కుఅని
వివాహం చేసుకునే హక్కు అని
ఎగిసి పడుతాం , సముద్ర కెరటాల్లా
ఎన్నికల రోజు , నేనొక్కడినే
వేయక పోతే, ఎలక్షన్లు ఆగిపోతాయా అనో
రెండు వేలు ఇంకను ఎవరూ ఇవ్వలేదని
నాలుగు గోడల మధ్య పడుకోడం
కర్తవ్యం నిర్వర్తించినట్లనబడదు
విద్యా హక్కు ఉందని
పాస్ చేయ మనడం
జీవించే హక్కు ఉందని
సభ్యత గా జీవించక పోవడం
మాట్లాడే హక్కు ఉందని
పరుష పదజాలంతో మాట్లాడటటం
కర్తవ్యమనబడునా?
రోడ్లపై చెత్తను వేయకపోవడం
ప్రభుత్వ ఆస్తులను కాపాడటం
పేదలు , రోగులు ఆపదలో ఉన్నపుడు ఆదుకోవడం
ప్రభుత్వ సూచనలను పాటించడం
అడవులను కాపాడటం పౌరుల కర్తవ్యం
మొక్కలను , చెట్లను పెంచడం
పర్యావరణాన్ని కాపాడటం
ప్రభుత్వానికి సలహాల నివ్వడం
శత్రువు చేతిలో చిక్కినా , దేశ రక్షణ సమాచారం
ఇవ్వక పోవడం పౌరుల కర్తవ్యం
అసంఘటిత శక్తుల సమాచారమివ్వడం
అవినీతి పరుల సమాచార మివ్వడం
ఎన్నికలలో వెళ్ళి ఓటు వేయడం
దేశ రక్షణలో పాల్గొనడం పౌరుల బాధ్యత
అంశం: *అన్నధాత*
శీర్షిక: *రైతే రాజు*
కోడి కూతతో నిదుర లేచి
హలాన్ని బుజాన ఎత్తుకుని
పొలముకు పోతివి రాజన్నా!
జలమును నింపితివి రైతన్నా!
సాగు మొదలు పెడితివి రాజన్నా!
గంజి మెతుకులు తింటూ
మామిడి తొక్కును అంచుకు పెట్టుకుని
రెక్కలు ముక్కలు చేసుకుని
తేళ్ళు , పాములతో సహవాసం చేస్తూ
నిశిలో మిలితమై , ఇంటికి చేరితివి
భూమి లేక , కౌలుకు తీసుకుంటే
కౌలు సబ్సిడి నీకు రాక పాయే
ఆరుగాళ్ళం కష్ట పడ్డా
అప్పులే నీకు మిగిలి పోయే
భార్యా బిడ్డలు పస్తులాయే
నకిలీ విత్తనాలతో సతమతమైతివి
నకిలీ మందులతో ఆగమైతివి
బోర్లు పడక బోరు మంటివి
వర్షపు నీళ్ళకే ఎదురు చూస్తివి
పండిన పంట చేతికొచ్చినపుడే
తుఫాను వచ్చే , పంట కొట్టుక పాయే
మిగిలిన ధాన్యం అమ్ముదమంటే
దళారులు ధర లేదని , రేపు మాపు అనే
అప్పు ఇచ్చిన శావు కారి నిలదీసే
అప్పుకట్ట లేక , ఆత్మహత్యకు పాల్పడితివి
రైతు సంకట వ్యవసాయ బిల్లులు
రద్దు చేయాలని , డిల్లీలో అడ్డావేసి
ఎండనక వాననక , భార్యా బిడ్డల వదిలి
రోగం నొప్పుల మరిచి , ఆర్ధిక బాధల విడిచి
యేడాది కాలంగా , పోరు చేసినా
కరుగక పాయే కర్కశ గుండెలు
పెట్టు బడి దారుల , గుత్తె దారులు
ఏమైనా ఎప్పటికైనా , రైతే రాజన్నా
స్వేదం చిందించి , సేద్యం చేసి
జనుల కడుపులు నింపేటి
*రైతే రాజన్నా , మా రైతే రాజన్నా*
జై కిసాన్!
అంశం: *పండుగలు - పరమార్ధం*
శీర్షిక: *సంస్కృతి - సాంప్రదాయాలు*
ప్రతి పండుగకు నుండు ఒక అర్ధం
భారతీయ సంస్కృతి , సాంప్రదాయాలు
ప్రజలలో ఐక్యత , సంతోషాల
కొన సాగించడమే, పండుగల పరమార్ధం
పండుగలు కొందరికి మోదముగా నుండు
మరి కొందరికి ఖేదముగా నుండు
ప్రతి పండుగకు నొక విశిష్టత నుండు
పండుగ పండుగకు , వైవిధ్యముండు
ఒక్కో పండుగది ఒక్కో సంస్కృతి
ఒక్కో పండుగది ఒక్కో సాంప్రదాయం
ఒక్కో కులానికి ఒక్కో పండుగ
ఒక్కో మతానికి ఒక్కో పండుగ
ఒక్కో రాష్ట్రానికి ఒక్కో పండుగ
పండుగల వలననే , సంతోషాలు
పండుగల వలననే , ఆనందాలు
పండుగలవలననే , వ్యాపారాలు
పండుగల వలననే , క్రొత్త బట్టలు
పండుగల వలననే , క్రొత్త వస్తువులు
పండుగల వలననే , ఐఖ్యత నుండు జనులు
పిండి వంటలు , పంచ పరమాన్నాలు
గారెలు, బూరెలు, సకినాలు,మడుగూలు
అర్షలు , లడ్డూలు , పూసలు , భక్షాలు
శనిగ పొడి, నువ్వుల పొడి,పేలాల పొడులు
తీరొక్క వంటల,రుచులు తెలియు పండుగలకే
బంధువులందరు కలియు పండుగలకే
మనషులు ఉల్లాసంగా నుండు పండుగలకే
ప్రేమాప్యతలు వెల్లి విరియు పండుగలకే
పండుగల పరమార్థం చెప్పనలవి కాదు
పండుగల పరమార్ధాన్ని వెలకట్టలేము
పండుగల పరమార్ధాన్ని కొలువ లేము
పేద ధనిక అను తేడాలు నుండవు
అన్ని పండుగలలోనూ ఆహ్లాదముండు
అంశం: *నాన్న - తండ్రి - పిత*
శీర్షిక: *ఆదర్శమూర్తి*
నాన్నంటే ప్రేమ!
నాన్నంటే రక్షణ!
నాన్నంటే ధైర్యం!
నాన్నంటే భయం!
నాన్నంటే త్యాగం!
నాన్నంటే ఆదర్శం!
నాన్నంటే బాధ్యత!
నాన్నకు నాన్నే సాటి!
నాన్నకు ఎవరు లేరు మేటి!
నడక నేర్పేది నాన్నే
భవిత నిచ్చేది నాన్నే
గమ్యానికి చేర్చేది నాన్నే
జీవిత పాఠాన్ని నేర్పేది నాన్నే
క్రొవ్వొత్తిలా కరిగి పోతూ వెలుగు నిచ్చేది నాన్నే!
అమ్మ శిషువును కడుపున మోస్తే
నాన్న తన బుజాన మోస్తాడు
జన్మ నిచ్చేది అమ్మైతే
జీవితాన్ని ఇచ్చేది నాన్ననే
అమ్మ ఇంటిని చూపించిన
నాన్న ప్రపంచాన్నే చూపించు
తన నడవడికతో ,
మన నడవడికను మార్చు
బాధ కలిగినా, సంతోషం కలిగినా
కష్టం వచ్చినా , దుఃఖం వచ్చినా
తన గుండెల మాటునే, దాచి పెట్టే
విశాల హృదయుడు
నాన్న కోపానికి ఒక అర్ధముంటుంది
నాన్న బాధకు ఒక అర్ధముంటుంది
నాన్న దుఃఖానికి ఒక అర్ధముంటుంది
నాన్న ఆనందానికి ఒక అర్ధముంటుంది
కుటుంబానికి రక్షణ నిచ్చే సైనికుడు
కుటుంబ భారాన్ని మోసే శ్రామికుడు
కానీ దాని నెవరికీ కనిపించ నివ్వని ధీశాలి
నాన్న ఆలోచనలు ,అనిర్వచనీయం
నాన్న వ్యక్తిత్వం ,ఆదర్శనీయం
నాన్న దూరదృష్టి మహోన్నతం
అది పది మందికి స్పూర్తి దాయకం
నాన్న మనసు చల్లని హిమపర్వతం
అది నిరంతరం పారే జీవ నది
అంశం: *మానవత్వం*
శీర్షిక: *దయార్ధ హృదయం*
భానుడు రోడ్లపైన
నిప్పులు కుమ్మరిస్తుంటే
ఇంటి యజమానులు పొమ్మంటే
కాళ్ళకు చెప్పులు లేకుండా
భార్యాపిల్లలు , చేతుల్లో పైసలు
లేక ,రెండు రోజుల నుండి
పస్తులతో ,
ముంబాయి నడి రోడ్డుపై
నిలుచున్న , వలస కూలీలకు
భోజనం పెట్టించి ,
వాటర్ బాటిల్స్ చేతికిచ్చి
తన స్వంత డబ్బులతో
వేలాది మందిని ,
వారి వారి సొంత ఊళ్ళకు
బస్సుల్లో ఎక్కించిన *సోనూ సూధ్*
*మానవతా* వాది!
తన స్వంత బిడ్డలను , కాడికి కట్టి
చేను దున్నుతున్న విషయం తెలిసి
కలత చెందిన , *సోనూ* వారికి ట్రాక్టర్
పంపడమే *మానవత్వం* ,అంటే
సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్
చదివిన అమ్మాయి
కూరగాయలమ్ముతున్నదని తెలిసి
కంట నీరు పెట్టి , ఆదుకున్న *సోనూ* దే
*దయార్ధ హృదయత* ,అంటే
కుల, మత , ప్రాంత బేధం లేకుండా
భారత దేశం నలు మూలల నుండి
వేలాది మంది ,ఏ మెస్సేజ్ పోష్ట్ చేసినా
అన్నా అంటే నేనున్నా నంటూ
సాయపడే *సోనూసూధే*
*మానవతావాది* ,అంటే
చేతిలో డబ్బు లేక పోయినా
ఇంటిని తాకట్టు పెట్టి , అప్పులు చేసి
కరోన బాధితులకు ఏ ఆపద వచ్చినా
నిద్రాహారాలు లేకుండా , భార్యా పిల్లల
సహాకారంతో , ఆర్ధిక సాయం చేసే *సోనే* ,
*కరుణామయుడు* ,అంటే
కరోనా సెకండ్ వేవ్ లో,మిస్సుడ్ కాలస్తే చాలు
ఆక్సీజన్ సిలెండర్ పంపిస్తానని
చరవాణి నెంబరిచ్చిన *సోనూ సూధ్* దే
*మానవత్వం* అంటే
ఆపదలో ఉన్న సాటి మనిషి పై
ప్రేమ ,దయ ,కరుణ , జాలి చూపడమే
మానవత్వ మంటే
అంశం: *సంగీతం*
*ఆపాత మధురాలు*
శీర్షిక: *రాగం*
రాగమేదైతే నేమి
అది సంగీతమే!
సన్నని శబ్ధమేదైతే నేమి
అది సంగీతమే!
చెట్లు ఊగినపుడు
వినిపించే శబ్ధం సంగీతమే!
చెట్టు కొమ్మలకు కట్టిన ఊయల నుండి
వినిపించే రాగం, సంగీతమే!
ఆనందంగా ఉన్నపుడు
తీసే కూని రాగాలు , సంగీతమే!
శిషువు పుట్టినపుడు ఏడుస్తే
అమ్మకు వినిపించేది , సంగీతమే!
సంగీతమంటే
యిష్టపడని మనిషీ
మోడు బోయిన చెట్టు
రెండూ సమానమే!
సంగీతంలో నున్న మాధుర్యం
సంగీతంలో నున్న మహత్యం
సంగీతం వలన కలిగే లాభం
వెల కట్ట లేని గొప్ప సంపద!
అమ్మ జోల పాట పాడి
శిషువును నిద్ర పుచ్చవచ్చు!
వేణు గానంతో
ఆవునుండి పాలు తీయవచ్చు!
పిల్లన గ్రోవితో
సర్పాల నాట్యమాడించ వచ్చు!
సంగీతంతో
రోగికి స్వస్థత చేకూర్చ వచ్చు!
సంగీతంతో
నరులను నాట్యమాడేట్లు చేయవచ్చు!
సంగీతమంటే
ప్రకృతి పరవశించి పోతుంది!
సంగీతమంటే
యిష్ట పడని వారెవరు?
ఆస్వాదించని వారెవరు?
సంగీతం లేకుండా సృష్టి లేదు!
సృష్టి లేకుండా సంగీతం లేదు!
సంగీతం లేకుండా ప్రకృతి లేదు!
సంగీతం లేకుండా మనిషి లేడు!
సంగీతం ఊపిరి!
సంగీతం ఉల్లాసం!
సంగీతం స్వాంతన!
సంగీతం మధురం!
అంశం: *ఆత్మీయత*
శీర్షిక: *ప్రేమ*
కన్న తల్లి దండ్రులను
అన్నా దమ్ములను
అక్కాచెల్లెండ్లను విడిచి
పుట్టెడు చిన్న నాటి జ్ఞాపకాలను మరిచి
ఒంటరిగా మెట్టినింటికి వచ్చిన
అర్ధాంగిని , భర్త , అత్తా మామలు ,ఆడపడుచులు
బావా మరుదులు , తోటి కోడళ్ళు
ప్రేమతో , ఆప్యాయతతో , *ఆత్మీయత* తో
అలరిస్తే , ఆ ఇల్లు కోడలుకు స్వర్గమే కదా!
కన్న బిడ్డలను , కన్న కొడుకులను
బజారు చెట్టును దులుపుతే
రాలిన కాయలు అనుకోకుండా
మా నిశి ఆనందాలకు పుట్టిన వారసులనుకోకుండా , మనసుతో
చక్కటి ప్రేమతో, *ఆత్మీయత* తో వాత్సల్యతో , సంస్కారంతో , బాధ్యతతో
పెంచి పోషించి , విద్యా బుద్దులు నేర్పి
తమ నడవడికతో నడకను నేర్పి
వారి బ్రతుకులకు బాటలు వేసిన
ఆ బంధం విడదీయలేని రక్త సంబంధం
ఆ కుటుంబమే భూతల స్వర్గం!
వృద్ధ తల్లి దండ్రులను , వాత్సల్యంతో
అనురాగంతో , ఆప్యాయతలతో , ప్రేమతో
అభిమానంతో , *ఆత్మీయత* తో , లాలనతో
గౌరవంతో సేవలు చేసిన
వారి జీవితం ధన్యం , మోక్షం తధ్యం!
*మార్గం కృష్ణ మూర్తి*
హైదరాబాద్
మెరసం కవితోత్సవం -2
అంశం: *నూతన శకం*
శీర్షిక: *కరోనా శకం*
ప్రపంచాన్ని
గడగడ లాడిస్తున్న
కాళ్ళు చేతులు కట్టేసిన
గడపదాటి బయటకు పోకుండా చేస్తున్న
గుడులు , బడులుమూసివేసిన
మూతికి మాస్కు కట్టించిన కరోనా
గత యేడాది నుండి కరోనా శకమే!
మొదటి వేవ్ అని ,రెండవ వేవ్ అని
మూడవ వేవ్ రాబోతుందని
పుకార్ల మీద పుకార్లు
రోగమే అంతు బట్టదాయే కరోనా శకంలో
ఇపుడు వాక్సిన్స్ వచ్చే వాతలు పెట్టే
సెకండ్ వేవ్ ఉధృత మాయే
ఎందువలన పెరుగుతుందో తెలియకపాయే
అందులో కో వాక్సిన్ వచ్చే, కో షీల్డ్ వచ్చే
వాక్సిన్ తీసుకున్న వారికీ కరోనా వచ్చే
తీసుకోని వారికీ కరోనా వచ్చే
ఎలా పాకుతుందో తెలియక పాయే
కరోనా ఎప్పుడు పోతుందో తెలియక పాయే
ఏది ఏమైనా , కరోనా జనులకు ఎన్నో నేర్పే
జనులందరు కలిసి తిరిగే శకం
గుడులు బడులు తెరుచుకునే శకం
విందులు వినోదాలు జరుపుకునే నూతనశకం
త్వరలో రావాలనే కోరు కుందాం!
అంశం: *పల్లె జీవనం*
శీర్షిక: *పచ్చని తరువులు*
చుట్టూ పచ్చని తరువులు
చల్లని మారుతాలు
కమ్మని మట్టి పరిమళం
వాతావరణం ప్రశాంతం
అంతకంటే మిన్న
పల్లె వాసుల ఆప్యాయతలు అమృతం!
కొక్కొరోకో...అనే కోడి పుంజు కూయగనే
తెల్ల వారు జామున్నే లేసి
వేగు చుక్క ఎక్కడుందో చూసి
నోట్లో యేప పుల్లేసి
పారా, గడ్డ పారా బుజానేసి
పొలాలకాడికి పరుగో పరుగు
పెందల కడే బర్ల మేపు వారు ,
బర్లను తోలుకుని పోతుంటే
గొల్ల వారు గొర్లను తోలుకుని పోతుంటే
అవి మే , మే అని అరుస్తుంటే ,
తుమ్ముతూ , గుంపులు
గుంపులుగా మేకలు, కనువిందు చేయు
వనితలు ఇల్లు వాకిలి ఊడ్చి
కళ్ళాపు చల్లి , ముగ్గులు వేసి
వంటలు తయారు చేసి ,
ఇంటి కాడి పనులన్నీ తీర్చుకుని
బువ్వ సద్ది కట్టుకుని, తోట కాడికి పోతే
పిల్లలు బడులకు ,
ముసలవ్వలు చంటి పిల్లలను ,
కోళ్ళను ఆడిస్తూ ఇంటి వద్దనే
ఏ రోగం వచ్చినా ఇంటి దినుసులే
డబ్బుతో పెద్దగా అవసరాలుండవు
ఏ ఆపతి వచ్చినా ఊరంతా తోడు
శావుకారికి సోలెడు వడ్లిస్తే
సోలెడు ఉప్పు , అలానే అన్నీ
బర్రె పాలతోటి పాలు పెరుగు చల్ల
అంచుకు మామిడి కాయ తొక్కు
సాయంత్రం అయిందంటే
అలసి సొలసి ఉన్న మగోళ్ళు ,ఆడోళ్ళు
ఓ బింకెడు సురాపానకం ఆరగించి
ఇంత తిని , వాకిట్లో మంచాలేసుకుని
ముచ్చట్టు చెప్పుకుంటూ హాయిగా నిదుర పోయే
పల్లె జీవనం ఎంతో
ఆనంద మయం , ఆహ్లాదకరం!
పల్లెలే దేశానికి శుభకరం!
అంశం: *జీవ కారుణ్యం*
శీర్షిక: *భూతదయ*
మనిషి
తన పుట్టుకను మరిచి
తన మూలాన్ని మరిచి
తన గమ్యాన్ని మరిచి
తన స్థానాన్ని మరిచి
తన ఊరును మరిచి
తన బంధు వర్గాన్ని మరిచి
తన సోదర వర్గాన్ని మరిచి
తన తల్లిదండ్రులను మరిచి
నేనే అంద మైన వాడినని
నేనే బాగా చదువుకున్న వాడినని
నేనే బాగా తెలివైన వాడినని
నేనే పెద్ద ఉద్యోగం చేస్తున్నానని
నేనే పెద్ద పదవిలో ఉన్నానని
నేనే రోజుకు లక్షలు సంపాదిస్తున్నాని
నేనే ప్రపంచ కుబేరుడనని
విర్రవీగుతూ
అహంతో , అహంభావంతో ,ఇగోతో
జీవిస్తూ ,
సాటి మనిషి మీద ప్రేమ , దయ
కరుణ , కారుణ్యం , వాత్సల్యం లేకుండా
ఈర్ష్య ,అసూయ , పగ ,కోపం పెంచుకుని
ఎదుటి వారిని చులకనగా చూస్తూ
ఒక యంత్రం లాగా , ఒక శిల లాగ
గడుపుతే , శిలలాగానే గుర్తింప బడుతాడు
శిలను ఎప్పుడైతే , శిల్పంగా చెక్కుతే
దానిని గుడిలో దేవుడిగా మొక్కుతారు
అలానే మనిషికి జీవ కారుణ్యం , భూతదయ , దానగుణం
ఎప్పుడైతే సంతరించు కుంటుందో
అప్పుడే మనిషిని , మనీషిగా గౌరవిస్తారు
భూతదయ లేని నాడు
మనిషి ఒక శిల గానే మిగిలి పోతాడు
అంశం: *నదులు*
శీర్షిక: *ప్రాణాధారం*
దేశం నిండా నదులే
రోజూ నీటి కోసం బాధలే
ఎప్పుడు తీరునో ఈ వెతలు
ప్రభుత్వాలకు రావాలి ఆలోచనలు
వెతకాలి ప్రతి ఒక్కరూ పరిష్కార మార్గాలు!
గంగా ,సింధూ ,యమునా ,బ్రహ్మపుత్ర
సరస్వతి ,కావేరీ ,కృష్ణా , గోదావరి ,
తుంగబధ్రా ,తపతి మొదలైన నదులెన్నో
అయినను ప్రజలకు నీటి బాధలెన్నో!
ఎక్కడో పుట్టి , ఎక్కడో ఉధృతి పెరిగి
నదులలా మారి,వాగులు వంకలు కలుపుతూ
ప్రాంతీయ భేదాలు లేకుండా,కల్మషం లేకుండా
చుట్టు ప్రక్కల వారి దాహార్తి తీరుస్తూ
సముద్రాలలో సేద తీరుతుండే!
నీరే జీవ కోటికి ప్రాణాధారం
పంటలకు పశువులకు
పక్షులకు కీటకాలకు
మొక్కలకు , మహాతరువులకు
నీరు లేకుంటే సర్వం భానుడికి ఫలహారం!
కుల ,మత , ప్రాంతీయ విభేదాలు లేకుండా
రాజకీయాల జోక్యం లేకుండా
నదుల అనుసంధానమే దీనికి పరిష్కారం
ప్రతి ఒక్కరూ అందించాలి సహాకారం
ప్రభుత్వాలు చుట్టాలి దీనికి శ్రీకారం
స్వచ్ఛమైన నీరే లేకుంటే,
జనులంతా హాహా కారం!
అంశం: *నగరాలు*
శీర్షిక: *కాలుష్య మయం*
నగర జీవనం ఎంతో వినోదం
సినిమాలు,షికార్లు,విందులు వినోదాల చందం
చిన్నా పెద్దలకు కలుగు మోదం
నగర జీవులు చెప్పెదరు ఆమోదం
టూరిష్టులు పొందెదరు మహానందం
ఉపాది కల్పనలకు నెలవు
ఐ.టి. ఉద్యోగాలకు కల్ప తరువు
బంగారమైన కుదువబెట్టి నిలుపవచ్చు పరువు
పల్లె వృద్దులకు , సనాతనులకు బరువు
అసంఘటిత కార్మికులకు ఉండదు కరువు
కుంటలు చెరువులన్నీ మటు మాయం
దారులన్నీ తారు , సిమెంట్ రోడ్లతో పరవశం
చిన్న వర్షం పడినా ఇండ్లన్నీ జలమయం
ట్రాఫిక్ , హారన్లతో నగరాలు సతమతం
పరిశ్రమలతో నగరాలు కాలుష్యమయం
గాలి ,నీరు కొనుక్కోవలసిన దౌర్భాగ్యం
ప్రభుత్వాలు ఆలోచించాలి పరిష్కారం
నగరాలను విస్తరించడమే ఉత్తమం
పరిశ్రమల వికేంద్రీకరణే పరమ ఔషదం
నగరంలో విరివిగా చెట్లు నాటడం నయం
కుంటలు, చెరువుల పరిరక్షించడం అవసరం
డైనేజీకి శాశ్వత పరిష్కారం చూడటం ముఖ్యం
సోలార్ ,ఎలక్ట్రిక్ వేహికిల్ ప్రవేషపెట్టడం అత్యవసరం
అంశం: *చరవాణి*
శీర్షిక: *భూతల స్వర్గం*
*వాణి* పూబోణి!
నీ రూపం అపురూపం!
నీ అందం, నాకు మహానందం!
నీవు తోడుంటే, వేయి యేనుగుల బలం!
నివురు గప్పిన నిప్పువు నీవు
ఆలోచనలను రేకెత్తిస్తావు
అభినందనలు చెప్పిస్తావు
ఆవేశాలు తెప్పిస్తావు
అదఃపాతాళలోకానికి నెట్టేస్తావు
బాధలో ఉన్నపుడు స్వాంతన నిస్తావు
ప్రతి సమస్యకు పరిష్కరం చూపెడుతావు
భయంగా ఉన్నపుడు ధైర్యాన్నిస్తావు
ఒంటరిగా ఉన్నపుడు వెన్నంటి ఉంటావు!
కుల మత ప్రాంతీయ భేదాలు లేవు
దూర భారాలు తెలియవు నీకు
పేద ధనిక అనకుండా అందరి చేతిలో ఇమిడి పోతావు!
అల్లంత దూరమున్న వారితోనైనా
ముచ్చట్లు పెడుతావు
ప్రత్యక్షంగా చూపిస్తావు
బాధలో ఉంటే ఓదార్చుతావు
వెలుగు నిస్తావు , వెన్నుతడుతావు!
కరోనా సమయంలో నీ సాయం అజరామం
మహమ్మారి విస్తరించ కుండా
కట్టడి చేసావు
ఆన్లైన్ క్లాసులతో అలరించావు
ఆన్లైన్ మీటింగులతో మెప్పించావు
నీ మేలును ఎన్నటికీ మరువలేము!
*వాణి* ఒక *భూతల స్వర్గం*
అంతే కాదు సుమా!
నీవు రెండు వైపులా పదునైన కత్తివి
ఆ *వాణి* వి నీవే , నా *చరవాణి* వి
*హస్తభూషణానివి , భూతల స్వర్గానివి*!
అంశం: *పేదరికం*
శీర్షిక: *పేదతనం*
*పేదరికం ఒక వరం!*
అది తెలుసుకుంటే జీవితం సుగమం!
పేదరికంలోనే తెలియు కష్ట సుఖాలు!
పేదతనంలోనే పొందెదం అనుభవాలు!
ఏ ఆపద వచ్చినా
ఏ సమస్య వచ్చినా
ఏ భయం వేసినా
ఏ అవమానం కలిగినా
తట్టుకునే శక్తిని , ధైర్యాన్ని ,
అనుభవం నేర్పుతుంది
పేదరికం నేర్పు ఓర్పు
బీదరికం నేర్పు *నేర్పరి తనం*
పేద తనం కలిగించు మనోధైర్యం
పేదరికం నేర్పు మంచి చెడు,సత్యం అసత్యం
బీద తనం బోధించు దర్మం అధర్మం
ధనం అహాన్ని , అహంభావాన్ని పెంచు
పేదరికం వినయాన్ని వినమ్రతను పెంచు
ధనవంతుడికి లోభి తనము నుండు
పేద వానికి దాన గుణము నుండు
ధనవంతుడికి స్వార్ధముండు
పేద వానికి త్యాగశీలత నుండు
ధనవంతుడికి కఠిన గుణము నుండు
పేద వానికి జాలి గుణము నుండు
ధనవంతులు తయారు చేసిన మందులతో
కరోనా రోగాలు ప్రపంచంలో పెరిగి పోతుండే
లక్షలు కోట్ల డబ్బు ఊడ్చి నట్లవుతుండే
శవాల గుట్టలు శ్మశానానికి వెలుతుండే
ఆర్ధిక వ్యవస్థలు అల్లకల్లోల మవుతుండే
పేదలు తయారు చేసిన మందులతో
లక్షలాది మంది హాయిగా జీవిస్తుండే
వేద ఇతిహాసాలు రచించినఋషులు పేదలే
అమెరికా అధ్యక్షుడు అభ్రహంలింకన్ పేదనే
భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేదనే
పేదరికమే వరం! మన మంచి తనమే ధనం!
అంశం: *కీర్తనలు*
శీర్షిక: *వాగ్గేయకారులు*
*కీర్తన ఒక భావన!*
ప్రసన్నతకు మార్గం!
ఆత్మీయతకు చేరువ!
భక్తిత్వంనిరూపణకు
కీర్తన ఒక సాధనం!
ఆన్నమయ్య
రామదాసు
త్యాగరాజ
పురందర దాసు
శ్యామ శాస్త్రి
మీరాబాయి
మరెందరో వాగ్గేయకారులు
భక్తి భావంతో బజియించే కీర్తనలు!
అదివో ....ఓ...
అదివో...అల్లదివో.... శ్రీ హరివాసము...
పదివేల శేషుల పడగల మయము..
అంటూ అన్నమయ్య కీర్తించే , శ్రీనివాసున్ని
ఏ తీరుగ నను దయజూచెదవో ...
యినవంశోత్తమ రామా....
నా తరమా భవ సాగర మీదను
నళిన దలేక్షణ రామా....
అంటూ గోపన్న కీర్తించే , శ్రీ రామచంద్రున్ని
ఇది నీకు మేర గాదుర శ్రీ రామ!
నా మది తల్లడిల్లెనురా ....
అంటూ త్యాగరాజ కీర్తించే , శ్రీ రామయ్యను
ఏడు కొండల వెంకన్న దర్శనమవ్వాలన్నా
శ్రీ రామచంద్రమూర్తి అనుగ్రహించాలన్నా
శ్రీమన్నారాయణుడు కనికరించాలన్నా
తపనతో తపించి ,
భక్తి భావనలతో కీర్తించి ,
తరించి పోయే ,
మోక్షమొందే
కీర్తనల వలన
భక్తి భావనల వలన
ఎంతో మేలు జరుగునని
ఎంతో తృప్తి కలుగునని
ముక్తి కలుగునని
సామాన్య జనానికి సందేశమిచ్చే!
అంశం: *నాకు నచ్చిన కవి*
శీర్శిక: *విశ్వ కవి శ్రీ శ్రీ*
*అక్షరాన్ని*
*ఆయుధంగా చేసుకుని*
*సాహిత్యాన్ని నడిపిన కవి*
*ఆల్ప అక్షరాల నుండి*
*అనల్ప భావాలను తీసిన గొప్పకవి*
కష్టాలను తన
ఇష్టంగా మార్చుకుని
విప్లవ సాహిత్యంలో తేలి యాడుతూ
శ్రమ జీవులలో ధైర్యం నింపుతూ
*కొంత మంది యువకులు*
*ముందు తరం దూతలు* అంటూ
కలం పట్టి నడిపించె కార్మిక ,కర్షక
పీడిత వర్గాల *అభ్యుదయ* కవి
పిన్న వయస్సులోనే
*పరిణయ రహస్యం*
*ప్రభవ* అను కావ్య సంపుటాలను వెలువరించి,
పొందిరి పెద్దల మన్ననల
*హంగ్రీ డర్టీస్* ప్రభావంతో
24 వ యేటనే వెలువరించే
*మహా ప్రస్థానం*
కూడూ గుడ్డకు చాలని
చిరుద్యోగాలయినా చేస్తాననీ
పస్తులైనా ఉంటాననీ
నమ్మిన సిద్ధాంతలకే
కట్టుబడిన మొండి ఘఠం
5వేలు ఆష చూపినా,
నిజాం 12 వ నవాబు అలీఖాన్
జీవిత చరిత్రను
కీర్తిస్తూ వ్రాయలేనని
త్రిప్పి పంపిన కలేజా ఉన్న
మహా కవి
అభాగ్యుల గుండెల్లో
రగిలే మంటల నెరిగి,
శ్రమైక జీవన సౌందర్యానికి
సాటిలేనిదేదీ లేదని
దగాపడిన తమ్ముళ్ళ కొరకు
చివరి వరకు పోరాడిన
సాహాసో పేతుడు *విశ్వకవి*
ధనవంతుల గుండెల్లో రైళ్ళు
పరుగెత్తించి
మంత్రినైనా , మరొకరినైనా
తన రచనలతో చీల్చి చెండాడిన *మహా కవి*
19 వ శతాభ్ధం నాదేనని గర్వంగా
చెప్ప గలిగిన ధీశాలి
కాదేది కవితకనర్హం ,అగ్గిపుల్ల ,
సబ్బుబిల్ల ,కుక్కపిల్ల అంటూ
ఎన్నో కవితలు , పాటలు ,గేయాలు
వ్యాసాలు ,పుస్తకాలు రచించి,
సాహిత్య విప్లవాన్ని
పరుగులు తీయించిన
*విరసం* అధ్యక్షుడు ,హేతువాది
నాస్తికుడు , సాహిత్య పిపాసి
గ్రాంధిక భాష , చంధో బద్ధ సాహిత్యాన్ని వదిలి
గురజాడ బాటలో నడుస్తూ
*మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు,
పదండి పదండి తోసుక పైపైకి* అంటూ
యువతరాన్ని ఉర్రూత లూపిన విప్లవ కవి
*మరో ప్రపంచం* అంటే కొత్త దేశం, కొత్తలోకం కాదు ,
*పేద తనం నుండి ఆర్ధికంగా ఎదిగే దశకువెళ్ళడం* అని కొత్త భాష్యం చెప్పిన కవి
ఎన్నో సన్మానాలు , మరెన్నో
పురస్కారాలు , బిరుదులు
పొంది విశ్వఖ్యాతి నొందే మన శ్రీ శ్రీ.
అంశం: *సాహిత్యం*
శీర్శిక: *సాహిత్య సొబగులు*
క్షరం లేనిదే అక్షరం
అక్షరాల సాన్నిహిత్యం
సాహిత్యం
అక్షరం అక్షరం
కలుస్తేనే పదం
పదం పదం
కలుస్తేనే వాక్యం
వాక్యాలను ఇంపుగా
పసందుగా అలరించేదే
సాహిత్యం
వర్ణనలు
భావోద్వేగాలు
ఆకర్షణలు
అనుభూతులు
రుచులు
వాసనలు
పాత్రలు
ప్రదేశాలు
పరిస్థితులను
ఒక పద్దతి ప్రకారం
వ్యక్తం చేసే సామర్ధ్యం
గలదే సాహిత్యం
సాహిత్యం మౌఖికం కావచ్చు
వ్రాత పూర్వకమై యుండవచ్చు
సాంప్రదాయమైనది కావచ్చు
అసాధారణ మైనది కావచ్చు
చందోబద్ధమైనది కావచ్చు
గ్రాంధీకం కావచ్చు
మాండలీకం కావచ్చు
ఎవరి వెసులు బాటు వారిది
అతి మధురమై ఉండాలి
అది సౌంధర్యంగా ఉండాలి
అల్పముండాలి
అనల్ప అర్ధముండాలి
దానికి సొబగులు అద్దాలి
సువాసనలు చల్లాలి
సాహిత్య అనేది
ఒక రకమైన కళాత్మక
వ్యక్థీకరణ
రచనలు చేసే ఒక కళ
భాషలు ఎన్ని యున్నను
భావన ఒక్కటే
కానీ తెలుగు సాహిత్యం
ఎంతో సుసంపన్నం
పసి పాపను ఊరడించేది
పాఠకుని మెప్పించేది
యువతను పరుగులు తీయించేది
సమాజంలో చైతన్యం తెచ్చేది
పది కాలాలు మనగల్గేది
మనసుకు ఇంపైనది సాహిత్యమే
అంశం: *ప్రవేటైజేషన్ , గ్లోబలైజేషన్ తో నిరుద్యోగ సమస్య*
శీర్శిక: *గ్లోబలైజేషన్*
అది 90 - 91
కరువు కాటకాలతో
ప్రజలు విల విల లాడుతుండే
దేశంలో అప్పులు పెర్గి పోయే
అప్పులు ఇచ్చేవారు కరువాయే
నాటి ప్రధాని పి.వి.
దేశ పరిస్థితిని గట్టెక్కించ
తర్జన బర్జన పడే
ఒక రోజు పి.వి.మదిలో
ఏదో తలుక్కుమనే
ఎప్పటి నుండో
ప్రపంచ ఒత్తిడి ఎలాగో ఉండే
తప్పని పరిస్థితులు
పి.వి. లిబరలైజేషన్ కు,
ప్రవీటీకరణకు ,
గ్లోబలైజేషన్ కు
మొగ్గు చూపే
ప్రపంచీకరణకు
ఒప్పందం కుదిరే
దేశానికి అప్పులు పుట్టే
ఉత్పాధకత పెరిగే
వాతావరణం సహకరించే
పంటలు సమృద్ధిగా పండే
విదేశీ వర్తకాలు పెరిగే
ప్రజల ఈతి బాధలు తగ్గే
ప్రవేటైజేషన్ , గ్లోబలైజేషన్ వలన
దేశంలో ఎన్నోమార్పులు
లేబర్ చట్టాల కోరలు పీకిరి
విదేశీ పెట్టుబడులకు
రెడ్ కార్పెట్ పరిచిరి
విదేశీ పెట్టుబడుదారులకు
స్వేచ్ఛ పెరిగే
నల్ల ధనానికి బారులు తెరిచే
చైనా వస్తువులు చౌకగా లభించే
స్వదేశీ పరిశ్రమలు మూత బడే
ప్రభుత్వ విదానాలు పలుచనాయే
విద్య అందని ద్రాక్ష పండాయే
నిరుద్యోగ సమస్య పెరిగి పోయే
ప్రభుత్వ సంస్థల
ప్రవేటైజేషన్ తో
ప్రభుత్వసంస్థల అమ్మకాలతో
ఉద్యోగ విరమణ వయస్సు పెంచడంతో
నిరుద్యోగ సమస్య మరింత పెరిగే
నేతలు దోచుకోవడం పెర్గిపోయే
కరోనాతో నేడు బాధలు మరిన్ని పెరిగే
ఉపాధి లేక , ఆదాయం లేక
పస్తులతో నిరుద్యోగులు బ్రతుకుతుండే
కరోనా రోగాలతో అశువులు బాయుచుండే
స్వాతంత్ర్యం వచ్చి
ఏడు దశాబ్ధాలు
దాటినా
నిరుద్యోగ సమస్య
విలయతాండం
చేస్తుండే
నిరుద్యోగి
కన్నీరు కారుస్తుండే
అవినీతి నేతల
ఆమడ దూరం పెట్టి
నిస్వార్ధ నేతల
గద్దెనెక్కించి
చట్టాలను గట్టిగా
అమలు పరుస్తూ
నల్లధనాన్ని బయటకు రప్పించి
పరిశ్రమలను స్తాపించి
ఉపాధి కల్పించిన
నిరుద్యోగ సమస్య
మటు మాయమగు
మెరసం కవితోత్సవం -2
అంశం: *స్నేహధర్మం*
శీర్శిక: *స్నేహం*
స్నేహమే బలం!
స్నేహమే జీవితం!
స్నేహమే ఆనందం!
స్నేహముంటే కలదు సుఖం!
స్నేహంతోటే కలుగు అనుబంధం!
స్నేహమంటే నమ్మకం
స్నేహమంటే ఆదర్శం
స్నేహమంటే అర్ధభాగం
స్నేహమంటే అనురాగం
ఒకరికొకరు తోడుగా
ఒకరిలో ఒకరు మిన్నగా
ఓపికతో నుందురు అండగా
ఓదార్చు చుండెదరు నిండుగా
ఆపద వచ్చినా, అశువులు బాసినా
నేనున్నానని అభయమిచ్చేదే స్నేహధర్మం!
అన్నదమ్ముల కంటేను
అక్కాచెల్లెండ్ల కంటేను
రక్త సంబంధాల కంటేను
ఒక్కోసారి ప్రాణమిచ్చేను
ప్రాణ మంటి స్నేహితులేను
కలరు నాడు నేడు ఈ జగత్తు లోనూ!
కల్మషం లేనిదే స్నేహబంధం
కసురు విసురు లేనిదే స్నేహబంధం
రాత్రిపగలు ఎరుగనిదే స్నేహబంధం
కలిమి లేములెరుగనిదే స్నేహబంధం
కులం మతం లెరుగనిదే స్నేహ బంధం
జాతి ప్రాంతం లెరుగనిదే స్నహబంధం
పెద్ద చిన్నా తేడాలెరుగనిదే స్నేహధర్మం!
నడుస్తూ పోతుంటే దారిలో
ముండ్లూ ఉంటాయి
పూలు ఉంటాయి
ముండ్లను తొలిగించుకుంటూ
ముందుకు సాగి పోవాలి
స్నేహితులలో
మంచి వారుందురు
చెడు వారుందురు
కొందరి పుర్రెకు పుట్టిన బుద్ది
పుడకలతోనే పోవు నందురు
నమ్మకం వమ్ము కావచ్చు
గమనిస్తూ ఉండాలి
వారిని ప్రక్కకు నెట్టుకుంటూ
జీవితం సంతోషంగా
ముందుకు సాగి పోవాలి
అంశం: *ఐచ్చికం*
శీర్శిక: *ప్రకృతి*
సృష్టికి మూలం ప్రకృతి
సృజనకు మూలం ప్రకృతి
శుభాలకు మూలం ప్రకృతి
సుఖాలకు మూలం ప్రకృతి
ఆక్సీజన్ కు మూలం ప్రకృతి
సువాసనలకు మూలం ప్రకృతి
కార్బన్డైయాక్సైడ్ అంతానికి మూలం ప్రకృతి
ప్రకృతే జీవకోటికి వరం
ప్రకృతి తోనే సహజీవనం చేస్తాం
ప్రకృతి నుండే ఎన్నో నేర్చుకుంటాం
ప్రకృతి లేకుంటే బ్రతకలేరు జనం
ప్రకృతిని శోధించడం ఎవరి తరం
ప్రకృతి అంటే పరవశించు పసిపాపైనా
ప్రకృతి అంటే పరవశించు సూర్యచంద్రులైనా
ప్రకృతి అంటే పరవశించు నెవరైనా
ప్రకృతిలోనే లభించు కావల్సింది ఏదైనా
ప్రకృతితో పులకించు నింగైనా , నేలైనా
ప్రకృతి పచ్చగుంటే వర్షించు నెప్పుడైనా
ప్రకృతి కరోనాను సృష్టించిందనడం పాపం
మనిషే సృష్టించాడు పెను భూతం
సాధించాలనుకున్నాడు లోకంలో విజయం
అయి పోతున్నాడు అతలా కుతలం
జంతువులకు పశుపక్షాదులకు రాని రోగం
మనుషులకెందుకొస్తుందో జనులకు తెలియక పాయే
ఆకులు అలములు తిన్న జంతువులు హాయిగా నుండే
ఆకులు అలములతో తయారైన
మందుకు అడ్డంకులు పెట్టిరి
ఉచితంగా ఇస్తానంటే కసురు తుండిరి
సనాతన ఆయుర్వేదాన్ని అనగదొక్కుతుండిరి
మందులు మింగిన మనుషులకు మాయరోగాలొస్తుండే
సైడెఫెకట్లతో రోగులు సతమత మవుతుండే
పిల్లల చదువులకు బిడ్డల పెండ్లికి చేసిన పొదుపు డబ్బు ఊడ్చుక పోయే
అవసరాలకు బయటకు పోదమంటే
లాక్ డౌన్ పెట్టి బాదు తుండే
ఫైనులు వేసి ముంచు తుండే
ఆకులు అలముల ఆయుర్వేద మందును
అనుమతించాలి
ప్రజల జీవితాలలో వెలుగులు చిందించాలి
దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టాలి
భారతీయ ఆయుర్వేద గొప్పతనాన్ని
ప్రపంచానికి తెలియజేయాలి
*దేశంలో ధరలు భగ భగ*
🌼🌻🌼🌻🌼🌻
సీ. ప.
ధరణిలోనధరలు దడనుపుట్టిస్తుండె
పెట్రోలు ధరలన్ని పెరిగి పోయె
గ్యాసు మొద్దుల ధర గగనకుసుమమాయె
సెగలతో రైతులు సేద్య మిడిచె
పంతుళ్లు పనిలేక పస్తులే నుంటుండె
జీతాలు రాకను జీవు లిడిచె
యిండ్లవి అద్దెలు ఇరుకున బెట్టగ
భార్య అలిగిపండె బాధ తోటి
తే. గీ.
యేడ్చి యేడ్చి జనులగొంతు యెండిపోయె
ఆదుకును నాధుడేలేక అలమటించె
నాయకులె దోచిరి నరుల నాడి పట్టి
కనుము అన్వేషణా!యిది కలియుగంబు
No comments:
Post a Comment