Tuesday, March 18, 2025

యుక్రైన్ రష్యా వార్

శీర్షిక: *యుద్దాన్ని నిలువరించాలి*


మానవత్వమా ఎక్కడా నీవు
కాగడ పట్టి వెతికినా కాన రావు
యుక్రైన్ ఏమైనా ఉగ్ర దేశమా
జెలన్ స్కీ ఏమైన ఉగ్ర  నేతనా!

పిల్లి మీద పులి పంజా విసరడం యుద్దమా
ఎలుక మీద ఏనుగు పడటం అది రణమా
స్వార్ధంతో దండయాత్ర  ధర్మమా
స్వతంత్ర దేశాన్ని ఆక్రమించడం న్యాయమా!

అయ్యో పాపం! ఏమిటీ ధారుణం
ఎందుకీ మారణ హోమం
ఉనికి కోసమా ,ఉన్నతి కోసమా
అగ్ర దేశాల స్వేచ్ఛ అంటే ఇదేనా
ప్రపంచ దేశాలకిచ్చే సందేశమిదేనా!

ఎడతెరుపని బాంబుల మోత
తోటి సైనికులని చూడకుండా ఊచ కోత
మానవ గృహాల , భవనాల కూల్చివేత
యిక ఇంతేనా బలహీన దేశాల తలరాత!

పిడుగుల్లా యుద్దటాంకులు మ్రోగుతుండే
జవానులు పిట్టల్లా  నేల రాలుతుండే
సామాన్య జనులూ కుప్పగూలుతుండే
ప్రజలు,విదేశీయులు పరుగులు పెడుతుండే!

విశ్వమంతా కాలుష్యంతో నిండి పోతుండే
ప్రత్యక్షంగా పరోక్షంగా మరెన్నో దేశాలపై
పెను ఆర్ధిక భారం పెరిగి పోతుండే
ఇరు దేశాల సంపదలు బూడిదై పోతుండే!

వొల్లు జలదరించి పోతున్నది
కంటికి కునుకు పట్టకున్నది
నోట మాట రాకున్నది
నోట్లోకి కూడు పోలేకుంటున్నది!

భారత దేశం సలహాలు కోరి వచ్చిన
ప్రతి దేశమూ ప్రజా స్వామ్య దేశమే
కూర్చుని చర్చించుదా మంటున్నాడు
పలు దేశాలతో చర్చలు జరుపుతున్నాడు
అగ్ర నేతలను నిత్యం వేడుకుంటున్నాడు!

స్వాతంత్ర్యాన్ని కాపడుకోవడం నేరమా
తన ప్రజలను రక్షించుకోవడం పాపమా
తన భూబాగాన్ని కాపాడుకోవడం ద్రోహమా
ఉక్రేయన్ లో తాను పుట్టడమే శాపమా!

తనను సజీవంగా చూడటం
ఇదే చివరి సారి కావొచ్చని కన్నీరు కార్చినా
ఒక ప్రజా స్వామ్య అగ్ర నేతగా విన్నవించినా
చలించకుండే మానవతా వాదులు
చెవిన పెట్టకుండే ప్రపంచ దేశాలు!

పది రోజుల నుండి సంప్రదింపులే
ఇప్పటికి ఎందరో సైనికులు హతమైరి
అగ్రనేతనుహతమార్చాక చర్చలఫలితమేమి
ఐక్య రాజ్యసమితి ఉండి ప్రయోజనమేమి!

అంతర్జాతీయ కోర్టు సుమోటోగా చేపట్టాలి
యిక నైనా ఆపాలి యిరు దేశాల యుద్దాలు
ప్రపంచ దేశాలు కలిసి ముందుకు రావాలి
యుక్రైన్ దేశాన్ని అన్ని విధాల ఆదుకోవాలి
నష్టపరిహారాన్ని పూర్తిగా యిప్పించాలి
దుర్నీతి దేశాలపై కఠిన ఆంక్షలు విధించాలి
ప్రపంచంలో శాంతి నెలకొల్పాలి!

    

No comments: