Friday, March 21, 2025

మనసుంటే మార్గం దొరుకుతుంది

అంశం: చిత్ర కవిత (తప్పులు సరి చేసుకోవడం)


శీర్శిక: *మనసుంటే మార్గం దొరుకుతుంది*

**ఇంట గెలిచి రచ్చ గెలువాలి*
అంటారు పెద్దలు

బురుద కుంటలో నిలువ ఉన్న నీరునుచూస్తే
దానికే అసహ్య మేస్తుంది భరించడానికి
ఇక వేరే ఇతర పశుపక్ష్యాదులకు
జంతువులకు ఎలా ఉపయోగ పడుతాయి!

మనిషి వ్యక్తిత్వం సక్రమంగా లేకుండా
నీచుడిగా, అబద్దాల కోరుగా, మోసకారిగా
త్రాగుబోతుగా ఉంటే  ఇతరులు
అసహ్యించుకుంటారు ఏవగించుకుంటారు
దూరం పెడుతారు దగ్గరకు రానివ్వరు
తన మాటలను ఎవ్వరూ లెక్క చేయరు!

అందుకనీ ప్రతి మనిషి రోజుకు
పది నిమిషాలు బ్రహ్మ ముహూర్తాన లేచి
తాను నిన్న ఏమైనా తప్పులు చేసానా ?
చేస్తే ఎందుకు చేసాను? మనసులో
చర్చించుకోవాలి !

తెలిసో తెలియకో ఉప్పు కారం తినే
ప్రతిఒక్కరూ పొరపాట్లు చేయడం సహజం
తప్పులు జరిగి ఉంటే విశ్వాన్ని క్షమాపణ కోరి
అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఆ పొరపాట్లు
మరల మరల జరుగకుండా చూసుకోవడం
ఉత్తముడి లక్షణం

*బంగారాన్ని సుత్తెతో కొట్టందే ఆభరణం కాదన్నట్లు*
మనిషి ఇలా తప్పులు సరిచేసుకుంటూపోతే
కొంతకాలానికి *మనీషిగా* తయారవుతాడు
గంగానది నీరు పవిత్రమవుతాడు
సర్వజన హితంగా పరివర్తన చెందుతాడు
తప్పులు సరి చేసుకోవడం ఖచ్చితంగాసాధ్యమే
వీలు కాని వారు సైకాలజిస్ట్ లవద్ద కౌన్సిలింగ్
తీసుకుని ఉత్తముడిగ మారాలి !

తప్పులు అనేవి వ్యక్తిత్వానికి
సంబంధించినవి కావచ్చు చదువు కావచ్చు
రచనలు చేయడం కావచ్చు మరేదైనా కావచ్చు
దేనినైనా పొరపాట్లను అధిగమిస్తూ పోతే
విజయం నీడలా పరుగెడుతూ వస్తుంది!

మంచి వ్యక్తిగా మారాక కుటుంబ సభ్యులు
స్నేహితులు బంధువులు గౌరవిస్తారు
ఆ విధంగా ముందు గెంట గెలిచి పిదప
బయట గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి
*మనసుంటే మార్గం ఉంటుంది!*

       

No comments: