Thursday, March 13, 2025

భారత దేశ ఎన్నికల విధానంలో లొసుగులు

అంశం: సిగ్మాలు


శీర్షిక: *భారత దేశ ఎన్నికల విధానంలో లొసుగులు*

దేశంలో ఐదేళ్ల కొకసారి *ఎందుకు* ఎన్నికలు జరుగుతాయి
దేశంలో ఐదేళ్ళ కొకసారి *ఎందుకు* ఓటర్లు ఓట్లు వేయాలి

*ఏమిటి* అవినీతి, భూకబ్జా, గూండా, అత్యాచార, నాయకులకు కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి చట్టంలో
*ఏమిటి* అవినీతి, భూకబ్జా, గూండా, అత్యాచార, నాయకులకు కూడా ఓట్లు వేస్తున్నారు ఓటర్లు
ఈ దుస్థితి నుండి *ఎలా* విముక్తి లభిస్తుంది
ఈ పరిస్తితి నుండి *ఎలా* బయట పడాలి

వ్యవస్థలలో *ఎప్పుడు* మార్పు వస్తుంది
ప్రజలు *ఎప్పుడు* ఉచిత పధకాల జపాల నుండి బయటకు వస్తారు

*ఎక్కడ* ఉంది లోపం వ్యవస్థలలోనా, చట్టాలలోనా?
*ఎక్కడ* ఉంది పాపం నాయకులలోనా, ప్రజలలోనా?

దీనికి బాధ్యులు *ఎవరు*?
ఓటర్లా, నాయకులా *ఎవరు*?

వ్యవస్థలు *ఇలా* నే కొనసాగుతే ఎప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా  గుర్తించబడుతుంది
మేధావులు  *ఇలా* నే ఇంకా ప్రశ్నించకుండా ఉంటే ఇంకెప్పుడు భారత దేశం అభివృద్ధి చెందుతుంది.

నీతిగా  పాలించడం *చేత* నైతేనే , నాయకులు పోటీ చేయాలి
శారీరకంగా మానసికంగా *చేత* నైతేనే, గెలిచాక మంత్రి పదవులు చేపట్టాలి

రాముడి *వలె* దేశాన్ని పాలిస్తూ ప్రజలను సుభిక్షంగా ఉంచాలి
కృష్ణుడి *వలె* నుంటూ నూరు తప్పులను చూసైనా కంసులను శిక్షించాలి

*అలా* గనుక నాయకులు పాలించినట్లయితే, ప్రజలు బానిసలుగా కాకుండా, ఆత్మాభిమానంతో జీవిస్తారు
*అలా* గనుక నాయకులు నిజాయితీగా, అవినీతి లేకుండా పాలించినట్లైతే, దేశం అభివృద్ధి చెందిన దేశంగా గుర్తించ బడుతుంది.

           

No comments: