అంశం:- *దివ్వెల పండుగ దీపావళి*
శీర్షిక:- *దీపావళి విజయానికి ప్రతీక*
*భారతీయుల సంస్కృతి సాంప్రదాయాలకు ఆచారవ్యవహారాలకు ప్రతీక...*
*చెడుపై సాధించిన మంచికి గుర్తుగా దీపావళి పండుగ వేడుక...*
*అమావాస్య చీకటిలో దీపాల వెలుగులే దీపావళి పర్వమిక...*
*దీనికి ఏ పండుగ సాటి రాదిక దేశమంతా జరిగేను మెండుగిక...*
*త్రేతా యుగంలో రావణసంహారం తరువాత అయోధ్యకు వచ్చిన రోజున...*
*ముల్లోక దేవతల రక్షించ సత్యభామ నరకాసురుడిని వధించిన రోజున..*
*సంపద శ్రేయస్సుకు దేవతైన లక్ష్మిదేవి విష్ణువును ఎంచుకున్న రోజున..*
*జైనులు మహావీరుడు నిర్వాణం పొందిన రోజున...*
*సిక్కులు వారి గురువు హరిగోవింద సింగ్ విడుదలైన రోజున...*
*ప్రజలు సంతోషంతో ఆనందంతో బాణసంచా కాల్చి దీపాలు అలంకరించి...*
*జరిపిరి దీపాల ఉత్సవం,అదే వస్తుండే ఆనవాయితీగా దీపావళి...*
*తిమిరాన్ని తొలగించి వెలుగును నింపే ఏకైక పండుగ దీపావళి...*
*ఇండ్లను శుద్ధి చేసుకొని రంగులు వేయించి నోములు జరుపుకొనేరు...*
*బొమ్మల కొలువులతో మహాలక్ష్మి పూజ జరిపేరు మెండుగ...*
*ఐదు రోజుల పండుగ అద్భుతం భారతీయులకు నిండుగ...*
*నరకచతుర్దశి దీపావళి భగినీహస్తభోజనం బలిపాడ్యమి గోవర్ధన పూజ...*
*దీపాల వరుసయే దీపావళి, కోటి దివ్వెల వెలుగుయే దీపారాధన...*
*దీపావళి బాణసంచాతో దీపకాంతులతో రాత్రి సమయంలో జరుపుకునే వేడుక...*
*పిల్లలకు పెద్దలకు పండుముసలి వారికి బంధుమిత్రులకు మహానందాలిక..*
*దీపావళి పండుగ నింపు కుటుంబ సభ్యులలో, ఆనందాలు సంతోషాలు మెండుగ...*
"ప్రకృతి సిద్ధమైనవి, అసాధారణమైన సంఘటనలను , అసాధారణమైన జీవులను మినహాయిస్తే , సాదారణంగా యే సమస్య అయినా మనిషి సృష్టించు కున్నదే . కాబట్టి ప్రతి సమస్యకు ఒక పరిష్కారముంటుంది . లేదా ప్రత్యామ్నాయమైనా ఉంటుంది . సమస్యను పరిష్కరించడం ద్వారా మనకు ప్రయోజనం కలుగుతే దానిని సమస్య అనే కంటే ఇది ఒక " అనుభవం " (Experience) " అవకాశం " (Turning point) అనుకోవడం సరియైనది . ప్రయత్నించి చూడండి. విజయం మీదే . సర్వే జన: సుఖినో భవంతు "
Pages
- Home
- About us
- Privacy Policy
- Disclaimer
- సామాజిక సమస్యలు & పరిస్కారాలు (SOCIAL PROBLOMS & SOLUTIONS)
- వివాహ వ్యవస్థ (MARRIAGE SYSTEM)
- ఎన్నికల సంస్కరణలు (ENNIKALA SAMSKARANALU)
- జ్యోతిష్యం (JYOTHISHYAM)
- Quiz /Puzzles
- AROGYAME MAHABHAGYAM
- బాల గేయాలు
- సీస పద్యాలు -ఛందస్సు - వీడియోలు (SEESA PADYALU - CHANDASSU- VIDEOS)
- ఛందస్సు (CHANDASSU ) - నేర్చుకుందామా !
- షేర్ మార్కెట్ /మ్యూచువల్ ఫండ్స్ (SHARE MARKET & MUTUAL FUNDS)
- కవి పరిచయాలు / INTRODUCTION OF POETS
- జీవిత సత్యాలు / LIFE CHANGING QUOTES / JEEVITHA SATYALU
- ఐడియాలు / టిప్స్ & ట్రిక్స్ (IDEAS / TIPS & TRICKS )
- ఛందస్సు (CHANDASSU ) - నేర్చుకుందామా !
- Sinima Songs -Lyrics / సినిమా పాటల - లిరిక్స్
- Budget 2023
- తెలుగు సాహిత్య ప్రక్రియల వీడియోలు / Sahitya Prakriyala Videos
Total Pageviews
Wednesday, March 26, 2025
దివ్వెల దీపావళి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment