*రామదాసు సాహితీ కళా సేవా సంస్థ:*
అంశం:చిత్రం కవితశీర్శిక: *ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి*
ఇప్పటి వరకు మూడు కోతుల చిత్రాలను
విరివిగా చూసి ఉంటారు జనాలు
చెడు వినవద్దు చెడు చూడవద్దు చెడు మాట్లాడవద్దని
అది గతం పాత ఒక రోత కొత్త ఒక వింత!
నేడు జ్ఞానవంతులు అలానే ఉన్నారు
జయప్రకాష్ నారాయణ గారు అంటారు
చెడ్డ వారిని చెడ్డ అంటే నేరమవుతుందని
నోరు మూసుకోవడమే ఉత్తమం అని!
కాలం అలా ఉంది మరి చేసేదేమీ లేదు సుమా
ఏదైనా సంఘటన చూసావు చూడలేదనుకోవాలి
ఒక మాట విన్నావు వినలేదు అనుకోవాలి
మౌనం ప్రశాంతతకు సోపానం!
కాలాలు మారుతుంటే తరాలు మారుతుంటే
విజ్ఞానులు కూడా వినడానికి, మాట్లాడడానికి
చూడడానికి నేడు ఆసక్తి చూపడం లేదు
మనకెందుకు బెడద అంటూ తప్పుకుంటున్నారు!
చట్టాలు అలానే ఉన్నాయి
వ్యవస్థలు అలానే ఉన్నాయి
పాలకులు అలానే ఉన్నారు
ప్రజలు అలానే ఉన్నారు
నలుగురుతో నారాయణ అంటున్నారు
దీనికి ఎక్కడో ఒకచోట ఫుల్ స్టాప్ పెట్టాలి!
No comments:
Post a Comment