Wednesday, March 19, 2025

నీ కోసమై తపిస్తున్నా

అంశం:*నీ కోసమే నేనై*


శీర్షిక: *నీ కోసమై తపిస్తున్నా*
       
సుందరమైన నా భామా!
ఓ అందాల చందమామా!
తళతళ మెరిసే నీ పళ్ళు
మిలమిల మెరిసే నీ కళ్ళు
కనువిందు చేసే నీ మోము
గలగలా గోదారిలా నీ నవ్వు
మనసు పులకరింప జేసే మల్లె పువ్వులా!

కలలు కన్నాను నీ కోసమై నేను
నింగిలోని హంస పక్షిలా
ఆకాశంలోని ధవళవర్ణ మబ్బులలో
సప్త వర్ణాల ఇంద్రధనుస్సులో
అరవిరిసిన పూదోటలలో
సప్త సముద్రాలలో  సమస్త లోకాలలో
వెతికాను వెతికి వెతికి వేశారాను!

మన్మధుడిని విచారించాను
ఇంద్రుడిని అడిగాను  చంద్రుడిని అడిగాను
చివరకు నారధుడికి మొరపెట్టుకున్నాను
పరి తపించాను నీ కోసమై నేను!

కండ్లు కాయలు కాసే
గుండె బండగా మారే
ఒళ్ళు మొద్దుబారి పోయే
మాటలు తడారిపోయే
మనసుకు కుదురు లేకపోయే
జీవితం ప్రశ్నార్థకమాయే!

ఇప్పటికీ నీ కొరకై వేచి చూస్తున్నా
ఇప్పటికీ *నీ కోసమై తపిస్తున్నా*
ఎప్పటికైనా వస్తావనే ఆశతో ఉన్నా
నీ రాకకై వేయి కళ్ళతో ఎదిరి చూస్తున్నా
నీ ఎదలో ఒదిగి పోవాలనుకుంటున్నా!

        

No comments: