Thursday, March 13, 2025

పరిపూర్ణత

*రామదాసు సాహితీ కళా సేవా సంస్థ*

అంశం:పరి పూర్ణత

శీర్శిక: *నిండుతనం*

ఏ లోటూ లేకుండా ఉండటం
పదిమందికి పెట్టే విధంగా ఆర్ధిక శక్తి
నలుగురికి చెప్పే విధంగా జ్ఞానం
కొంతమందికి సేవ చేసే విధంగా ఆరోగ్యం
కలిగి ఉండటం పరిపూర్ణత!

నిస్వార్ధం నిజాయితీ
సత్ప్రవర్తన నిండుతనం
విశాల హృదయం
మంచి ఆలోచనలు
కలిగి ఉండటం పరిపూర్ణత!

తోటి వారిపై దయ జాలి కరుణ
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం
దాన గుణం దయా గుణం సేవా గుణం
కలిగి ఉండటం పరిపూర్ణత!

పరిపూర్ణత గలవారు పూర్ణత్వం గలవారు
విషయ పరిజ్ఞానం కలిగిన వారు
కీర్తి ప్రతిష్టలు కలిగిన వారు
మూర్తీభవించిన వారు వ్యక్తిత్వం గలవారు
చక్కని సలహాలు ఇస్తారు
చెప్పిన మాటలు వింటారు
వారి మాటకు విలువ నిస్తారు గౌరవమిస్తారు!

No comments: