అంశం:అమర వీరులు
శీర్శిక: *అమర వీరులారా లాల్ సలామ్!*
అమ్మను వదిలి , ఆలిని వదిలి
కన్న బిడ్డలను, కుటుంబాన్ని వదిలి
పుట్టి పెరిగిన పల్లె ప్రాంతాల వదిలి
పంచ ప్రాణాలను గాలికి వదిలి
దేశం కొరకు, దేశ ప్రజల రక్షణ కొరకు!
భారతదేశ సరిహద్దులో , ఎత్తైన శిఖరాలలో
గజ గజ వనికే చలులలో, మంచు కొండలలో
ఎడారులలో , ధట్టమైన అడవులలో
కిలోల కొద్ది యుద్ధసామాగ్రి , బుజాలలో
నడుముకు మందుగుండ్లు, స్టెన్ గన్స్ చేతులలో!
వేయి కళ్ళతో శత్రువుల కనిపెడుతూ
ముందుకు సాగుతుంటారు వేటాడుతూ
శత్రువుల బారి నుండి రక్షించు కుంటూ
శత్రువులతో యుద్ధ భూమిలో పోరాడుతూ
అమరులైన వీర జవానులారా
అమర వీరులారా మీకు లాల్ సలామ్!
కులం మతం భేదమెరుగని
భాషా యాసా లెక్కలు వేయని
ప్రాంత విభేదాలెరుగని దేశరక్షనే
ధ్యేయమనీ ప్రజల రక్షణే లక్ష్యమని
అమరులైన ఓ త్యాగశీలులారా
భరత మాత ముద్దుబిడ్డల్లారా
మీకు లాల్ సలామ్!
నాయకుడు చనిపోతే శిలగా వెలుస్తున్నాడు
కవి మరణిస్తే జనుల గుండెల్లో కొలువౌతున్నాడు
దేశం కోసం పోరాడి వీర మరణం చెందిన
అమర వీరులు అనామకులైపోతున్నారు
ఎందుకు.....? ఏమిటీ విచిత్రం...?
ఎక్కడుంది లోపం...?
ఎంతమందికి తెలుసు వీర జవాన్ల పేర్లు..?
ఎందుకు గుర్తింపు లేకుండా పోతున్నారు..?
అమర వీరుల దినోత్సవం రోజు
స్మరించుకోవడం వరకేనా..?
ఓ భారతీయ మేధావులారా!
అమరవీరుల గుర్తింపుకు కృషి సల్పండి!
No comments:
Post a Comment