Friday, March 21, 2025

జయహో సునీతా విలియమ్స్

అంశం: సునితా విలియమ్స్


శీర్శక: జయహో సునీతా విలియమ్స్!

ఆమె ఒక విజ్ఞాని అంతరిక్ష వ్యోమగామి
నాయకత్వ పటిమ ఊహాకందని తేజస్సు
గొప్పధైర్యవంతురాలు సాహాసవంతురాలు
అంతరిక్ష శాస్త్రంలో ఆరితేరిన ఘనురాలు
వ్యోమగామి పరీక్షలలో ప్రతిభావంతురాలు

అందరిలాగే ఆమె సాధారణ వనిత
పొందెను నేడు చరిత్రలో ఎంతో ఘనత
భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త సునీత
సువర్ణాక్షరాలతో లిఖించ దగిన చరిత!

తల్లి గర్భం మాయలో పసి బిడ్డ లాగా
నవ మాసాలు ఎలా పొదిగి ఉంటుందో
అలానే నవ మాసాలు రోదసీలో ఒదిగి
పుడమిని పులకరింప జేసిన ధీర తరుణి
అంతరిక్ష శాస్త్రవేత్త  సునీత విలియమ్స్!

తొమ్మిది నెలలు రోదసిలోనే ఆవాసం
విశ్వం తోనే వ్యోమగామిగా సహవాసం
నిత్యం హనుమాన్ జపం భగవద్గీత పఠనం
స్థిత ప్రజ్ఞత ఆత్మ విశ్వాసమే ఆమే మనోబలం
అకుంఠిత దీక్షతో సునీత నేటికీ సురక్షితం!

అంతరిక్ష వ్యోమ నౌకలో
సాంకేతిక ఇబ్బందులు తలెత్తినా
మొక్కవోని దీక్షతో శూన్యంలో పరిశొధన
ముప్పది నాలుగు వారాలు
ఇక్కట్ల పాలైన వ్యోమ గాములు
*సునీత విలియమ్స్* మరియు *విల్మోర్*!

దేశ అంతరిక్ష విజ్ఞానం కొరకు
ప్రాణత్యాగానికి సిద్ధపడిన ధీర వనిత
ఎనిమిది రోజుల పరిశోధనకువెళ్ళిన సునీత
"స్పేస్ - ఎక్స్ , నాసాల" సంయుక్త కృషితో
పద్దెనిమిది గంటల అంతరిక్ష ప్రయాణంతో
ఎట్టకేలకు డ్రాగన్ వ్యోమ నౌకలో
ఫ్లోరిడా సముద్ర తీరంలో పునర్జన్మనెత్తి
విజయ దరహాసంతో దేశ ప్రజలకు
అభివాదం చేసిన  *సునీత విలియమ్స్*
జయహో సునీతా విలియమ్స్!

గుజరాత్ రాష్ట్రానికి చెందిన
మన భారతీయ అంతరిక్ష వ్యోమగామి
అంతరిక్ష శాస్త్రవేత్తలలో సునీతా విలియమ్స్
అత్యంత అంతరిక్ష ఆనుభవశాలి
దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ పటంలో నిలిపిన
సరోజ స్త్రీ జాతికి  స్పూర్తి
తెచ్చెను దేశానికి ఘన కీర్తి 
యావత్ ప్రపంచానికి మార్గదర్శిణి
జయహో సునీతా విలియమ్స్
జయ జయహో!

             

No comments: