Friday, March 14, 2025

కుసుమ ధర్మన్న

శీర్షిక: దళిత వర్గాల ఆశాజ్యోతి

పువ్వు పుట్టగానే పరిమళించినట్లు
అంటరాని తనంపై సమరశంఖం మ్రోగించిన
దళిత వర్గాల ఆశాజ్యోతి కుసుమ ధర్మన్న!

మాలల పాలిట వరం తొలితరం దళిత కవి
గొప్ప విద్యావేత్త కవి రచయిత వ్యాసకర్త
వక్త సాహితీ వేత్త బహుభాషా కోవిదుడు
గొప్ప వైతాళికుడు జయభేరి సంపాదకుడు!

తమ జాతి హక్కుల కొరకు
అంబేద్కర్ ఆశయాల అమలు జేయ దలిచి
గాంధీజీ గారి సభనే భహిష్కరించి
మహాత్ముడితో ధళిత పేటలలోనే సభలను
ఏర్పాటు చేయించ గలిగిన ధీరుడు!

రచించిరి మా కొద్దీ నల్ల దొరతనము
మా కొద్దీ తెల్ల దొరతనం గేయాలు
నిమ్న జాతి తరంగణి, హరిజన శతకం!

సర్ధార్ వల్లభాయ్ పటేలు వలే
తన ధళిత నిమ్న జాతి కొరకు
గుండెనెదిరించి పోరాడిన ఘనుడు!

వారి పిల్లల పేర్లు చూడముచ్చటగొలుపు
దేశ భక్తి  దేశ నాయకులపై అభిమానమే
పతిత పావన మూర్తి, మోహన్ దాస్
కరంచంద్ గాంధీ, భాగ్య లక్ష్మి , కాశీ విశాలాక్షి
చిత్త రంజన్ , భగవాన్ దాస్!

బురుదలో పుట్టిన తామర
చివరకు విష్ణు పాదాల చెంతకు చేరినట్లు
దళిత జాతిలో పుట్టిన కుసుమ ధర్మన్న
చివరకు జనుల గుండెలలో నిలిచి పోయే!

No comments: