అంశం: అలంకారాలు (అతిశయోక్త్యలంకారాలు)
శీర్శిక: *అమ్మ చేతి కర్ర!*
అమ్మ చేతి కర్ర మహాద్భుత మహిమ గలది
అది నడుస్తుంటే పంచుతుంది వెలుగులు
చుట్టూరా రంగు రంగుల దారాల జిలుగులు
అడుగు అడుగునా సప్త వర్ణాల శోభలు
రంగు రంగుల అంచుల కొత్త కొత్త చంద్రికలు
చుట్టి చుట్టి కర్రను *ఇంద్ర ధనుస్సులా* మలిచే
ఎంతో *అపురూపమైనది* అమ్మ చేతి కర్ర!
కానీ, చేస్తుంది ఆ కర్ర యెన్నో గొప్ప పనులు
చేతి కర్రే అమ్మకు ఆత్మీయురాలు సేవకురాలు
ఒక్క నిమిషం లేకపోతే విలవిల లాడుతుంది
*అద్భుతమైన ఆయుధం* అమ్మ చేతి కర్ర!
*అద్భుతమైన ఆయుధం* అమ్మ చేతి కర్ర!
గాలిని రప్పించాలన్నా
తనకు తాను ప్రైవేసీ కోరుకున్నా
కొండంత ధైర్యాన్ని యిచ్చేది కోటి వరాల నిచ్చేది
తన జీవితాన్ని రక్షించేది మనిషిలా ధైర్యాన్ని ఇచ్చేది
బెడ్డుపైననే సేదతీరేది అనురాగాల అమ్మ చేతి కర్ర
అమ్మకు *ఆరో ప్రాణం* అమ్మ చేతి కర్ర
అమ్మకు నేడు నూరు ఏళ్ళు *మహా భాగ్యం*!
*మార్గం కృష్ణ మూర్తి 🙏*
వెలుగులు చిందించాలన్నా
వేడి నీటి ఊటను రప్పించాలన్నా
పలకరించాలన్నా గుర్తు చేయాలన్నా
కుక్కను బెదిరించాలన్నా పిల్లిఅదిలించాలన్నా
*బహుళార్ధక సాధక సాధనం* అమ్మ చేతి కర్ర!
కొండంత ధైర్యాన్ని యిచ్చేది కోటి వరాల నిచ్చేది
తన జీవితాన్ని రక్షించేది మనిషిలా ధైర్యాన్ని ఇచ్చేది
బెడ్డుపైననే సేదతీరేది అనురాగాల అమ్మ చేతి కర్ర
అమ్మకు *ఆరో ప్రాణం* అమ్మ చేతి కర్ర
అమ్మకు నేడు నూరు ఏళ్ళు *మహా భాగ్యం*!
*మార్గం కృష్ణ మూర్తి 🙏*
No comments:
Post a Comment