శీర్షిక:: ప్రకృతి
సృష్టికి మూలం ప్రకృతి
సృజనకు మూలం ప్రకృతి
శుభాలకు మూలం ప్రకృతి
సుఖాలకు మూలం ప్రకృతి
ఆక్సీజన్ కు మూలం ప్రకృతి
సువాసనలకు మూలం ప్రకృతి
కార్బన్స్ అంతానికి మూలం ప్రకృతి
ప్రకృతే జీవకోటికి వరం
ప్రకృతి తోనే సహజీవనం సహజం
ప్రకృతి నుండే ఎన్నో నేర్చుకుంటాం
ప్రకృతి లేకుంటే బ్రతకలేరు జనం
ప్రకృతిని శోధించడం ఎవరి తరం
ప్రకృతి అంటే పవళించు పసిపాపైనా
ప్రకృతి అంటే పరవశించు సూర్యచంద్రులైనా
ప్రకృతి అంటే ఆనందించు నెవరైనా
ప్రకృతిలోనే లభించు కావల్సింది ఏదైనా
ప్రకృతితో పులకించు నింగైనా , నేలైనా
ప్రకృతి పచ్చగుంటే వర్షించు నెప్పుడైనా
ప్రకృతి కరోనాను సృష్టించిందనడం మూర్ఖం
మనిషే సృష్టించాడు పెను భూతం
సాధించాలనుకున్నాడు లోకంలో విజయం
అయి పోతున్నాడు అతలా కుతలం
జంతువులకు పశుపక్షాదులకు రాని రోగం
మనుషులకెందుకొస్తుందో జనులకు తెలియక పాయే
ఆకులు అలములు తిన్న జంతువులు హాయిగా నుండే
ఆకులు అలములతో తయారైన
మందుకు అడ్డంకులు పెట్టిరి
ఉచితంగా ఇస్తానంటే కసురు తుండిరి
సనాతన ఆయుర్వేదాన్ని అనగదొక్కుతుండిరి
మందులు మింగిన మనుషులకు మాయరోగాలొస్తుండే
సైడెఫెకట్లతో రోగులు సతమత మవుతుండే
పిల్లల చదువులకు బిడ్డల పెండ్లికి చేసిన పొదుపు డబ్బు ఊడ్చుక పోయే
అవసరాలకు బయటకు పోదమంటే
లాక్ డౌన్ పెట్టి బాదు తుండే
ఫైనులు వేసి ముంచు తుండే
ఆకులు అలముల ఆయుర్వేద మందును
అనుమతించాలి
ప్రజల జీవితాలలో వెలుగులు చిందించాలి
దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టాలి
భారతీయ ఆయుర్వేద గొప్పతనాన్ని
ప్రపంచానికి తెలియజేయాలి
No comments:
Post a Comment