అంశం: జానపద గేయాలు
శీర్షిక: వచ్చిందయ్యా స్వాతంత్ర్యం వచ్చిందయ్యా!
పల్లవి;
వచ్చిందయ్యా స్వాతంత్ర్యం
వచ్చిందయ్యా...
ఆంగ్లేయుల పాలనలో
ఆహుతైన మనదేశం...
దుష్ట గాండ్ల మోసగాండ్ల
కొంందరినీ నింపుకునీ... "వచ్చిందయ్యా"
చరణం:01
అగుపడిన పిల్లవాళ్ళకు..
అగుపడిన ముసలి వాళ్ళకు..
గొప్ప గొప్ప నీతులెన్నో..
గుచ్చి గుచ్చి చెప్పిరయ్య... "వచ్చిందయ్యా"
చరణం:02
చీకటి వేళ కాగానే..
బింకెడంత చేతబట్టి...
అందులోకి గుడ్డు మాడ్చి..
బేవ్ మంటూ తాగిరయ్య.... "వచ్చిందయ్యా"
చరణం:03
అర్ధరాత్రి దాక నైనా...
వాడ వాడ తిరిగిరయ్య ...
సి.ఐ.డిల మంటూ...
షికార్లు కొట్టిరయ్య.... "వచ్చిందయ్యా"
చరణం:04
అందమైన పడుచు ఇంట్లో...
ఆ రాత్రి తిష్ట వేసి....
తెల్లవారి పోగానే...
దొరలమంటూ తిరిగిరయ్య... "వచ్చిందయ్యా"
No comments:
Post a Comment