Saturday, March 22, 2025

అన్నదాత

నేటి అంశం:  పదాల కవిత  
*నింగి అన్నదాత ఎదురు చూపు అంకురం*

శీర్షిక: *అన్నదాతా సుఖీభవ!* 

నిత్య కృషీ వలుడు
నిరంతర శ్రమజీవుడు
దేశానికి వెన్నెముక అతడు
కోట్లాది జనులకు *అన్నదాత* కర్షకుడు

కండలు కరిగించుతూ
*నింగి* నేలపై ఆధారపడుతూ
గంజి మెతుకులనారగిస్తూ
ఆలు బిడ్డల డొక్కలు మాడ్చే రైతన్నా!

గోచిని చెక్కి తలకు రుమాలు చుట్టి
హలమును పట్టి కావడెద్దుల కట్టి
పొలమును దున్ని  ఒడ్డులను గట్టి
గొర్రును తోలి మడులను కట్టి

*అంకురం* లను పోసి నాట్లను వేసి
నీరును పారించి మందులు చల్లి
పంటలు పండించు రైతన్నలకు
ఏమి మిగులు తుండే నేడు అన్నదాతలకు!

భూముల సాగు చేయు రైతు
దేశ విదేశ ప్రజలకు బంగారు బాతు
రైతు వెనకాలే ఉంటాడు ఒక ఆంబోతు
శవాలపై చిల్లర ఏరుకునే తిరుగుబోతు!

కల్తీ విత్తనాలతో కలవరం పుట్టిస్తుండే
పలానా పంటే వేయాలని వత్తిడి తెస్తుండే
ఎరువులు సమయానికి అందకుంటుండే
పండించిన పంటలకు గిట్టుబాటుధర లేకుండే!

రైతు బంధు పథకానికి *ఎదురు చూపు* లే ఉండే
పెట్టుబడులకు రైతులు అప్పులే తెస్తుండే
పంటలకొచ్చిన డబ్బు అప్పులు తీరకుండే
అప్పులు తీరక అన్నదాతలు అవని వీడుతుండే!

ఆరుగాలం చేసే కౌలుదారుకట
రైతు బంధు పథకం ఎందుకట 
భూస్వాములనే మేపే టందుకట
రైతుల అప్పుల పాలు చేసే టందుకట
ఆపై ఆత్మ హత్యల పురికొల్పేటందుకట!

అన్నదాతా సుఖీభవ! 

No comments: