అంశం:*విశ్వావసు ఉగాది పర్వదినం*
శీర్షిక: శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సరం
ఉగాది
ఓ నూతన తెలుగు సంవత్సరమా!
ఓ దివ్య తేజోత్సవమా!
నిన్నేమని అర్ధించను? నీకేమని నివేదించను?
కరోనాతో *శార్వరీ* యుద్దాలతో *ప్లవనామ*
ఎన్నికలు రాజకీయ అనిశ్ఛితితో *శుభకృత్*
స్కామ్ లు ఈ.డి కేసులతో *శోబాకృత్*
షేర్ మార్కెట్ కుప్పగూల్చి
ఆర్ధిక వ్యవస్థ ను అతలాకుతలం చేసి *క్రోధి*
నేడు *విశ్వావసు* అంటూ
ప్రభవ నుండి అక్షయ వరకు యేటా నీ పేర్లు మార్చగలవే!
కానీ, ఈ పేదల కనీస అవసరాలు
ప్రభవ నుండి అక్షయ వరకు యేటా నీ పేర్లు మార్చగలవే!
కానీ, ఈ పేదల కనీస అవసరాలు
ఏ నాడైనా తీర్చావా!
ప్రతి కాన్పులో పన్నెండు మంది బిడ్డలకు
జన్మ నిస్తావే
చైత్రం,వైశాఖం జేష్టం నుండి ఫాల్గుణంవరకూ..
ప్రతి కాన్పులో పన్నెండు మంది బిడ్డలకు
జన్మ నిస్తావే
చైత్రం,వైశాఖం జేష్టం నుండి ఫాల్గుణంవరకూ..
పాడ్యమి విదియ తదియ తిధులంటూ
అశ్విని భరిణి కృత్తిక రోహిణి నక్షత్రాలంటూ
మనుమలు మనుమరాండ్లతో!
వసంత గ్రీష్మ వర్ష ఋతువు లను
ఎండ వాన చలి కాలాలను అక్కా చెంల్లెండ్లు
అన్నా తమ్ముళ్ళ చేసుకుని సుఖంగా జీవిస్తావు
యే బిడ్డ కాలంలో మమ్ముల ఉద్ధరించావు?
*క్రోధి* నామ సంవత్సరలో అసువులు బాసి
*విశ్వావసు* నామ సంవత్సరంలో
ఆవిర్భవించావ్, ఎందుకు?
కన్నకొడుకుల కబంధ హస్తాలలో బంధింపబడ్డ బకాసురుల పునరుద్ధరింప దలిచావా?
మానవత్వాన్ని మంట గలుపుతున్న
మనుజులకు మద్దతు ఇవ్వదలిచావా?
వద్దు వద్దు వత్సరమా!
ఓ నూతన సంవత్సరమా!
నీ సువర్ణాస్థాల ద్వారా
విభజించు ఈ మానవుల
పుట్టిన వారందరూ మనుష్యులు కారనీ
ఏవో కొన్ని జీవ రాశులు మాత్రమే ననీ
సత్యం ఇది సత్యం వత్సరమా!
అన్నా తమ్ముళ్ళ చేసుకుని సుఖంగా జీవిస్తావు
యే బిడ్డ కాలంలో మమ్ముల ఉద్ధరించావు?
*క్రోధి* నామ సంవత్సరలో అసువులు బాసి
*విశ్వావసు* నామ సంవత్సరంలో
ఆవిర్భవించావ్, ఎందుకు?
కన్నకొడుకుల కబంధ హస్తాలలో బంధింపబడ్డ బకాసురుల పునరుద్ధరింప దలిచావా?
మానవత్వాన్ని మంట గలుపుతున్న
మనుజులకు మద్దతు ఇవ్వదలిచావా?
వద్దు వద్దు వత్సరమా!
ఓ నూతన సంవత్సరమా!
నీ సువర్ణాస్థాల ద్వారా
విభజించు ఈ మానవుల
పుట్టిన వారందరూ మనుష్యులు కారనీ
ఏవో కొన్ని జీవ రాశులు మాత్రమే ననీ
సత్యం ఇది సత్యం వత్సరమా!
ఓ నూతన సంవత్సరమా!
నీ బలాన్నంత కూడగట్టి గంగవోలే పొంగిచెప్పు
ఏమని?
వేదిక లెక్కి చెప్పే నేతల నీతులు
నిరుపేదల బ్రతుకుల కడుపులు నింపవనీ
అన్నదాతల ఆర్త నాధాల నాదుకోవనీ
పేద ప్రజల డొక్కలు నిండుటకు
నీ బలాన్నంత కూడగట్టి గంగవోలే పొంగిచెప్పు
ఏమని?
వేదిక లెక్కి చెప్పే నేతల నీతులు
నిరుపేదల బ్రతుకుల కడుపులు నింపవనీ
అన్నదాతల ఆర్త నాధాల నాదుకోవనీ
పేద ప్రజల డొక్కలు నిండుటకు
నిత్యం కృషి చేస్తూనే ఉండవలెననీ
ఈ రాజనీతిజ్ఞుల మాటలు
ఈ రాజనీతిజ్ఞుల మాటలు
నీటి మీద బుడగలనీ
ఉత్తర కుమారుని ప్రగల్భాలే ననీ!
ఓ విశ్వావసు సంవత్సరమా
నీ పాలనలో నైనా విశ్వాసంగా పాలించు
జనులలో విశ్వాసాన్ని పెంచు
ఇచ్చిన హామీలను నెరవేర్చు
బీద మధ్య తరగతి కుటుంబాలలో
చిరు దివ్వెలను వెలిగించు
ఓ నూతన సంవత్సరమా!
ఓ దివ్య తేజోత్సవమా!
ఓ దివ్య తేజోత్సవమా!
No comments:
Post a Comment