Thursday, March 13, 2025

ఆషాఢమాసం విశిష్టత - బోనాలు

శీర్షిక: "ఆషాఢ మాసం విశిష్టత- బోనాలు"

ఆశాడ మాసాన ఆకాశంలో మబ్బులు 
జగతి నంతయు కుండ పోత వర్షాలు
చెరువులు నిండును మత్తళ్ళు పడును
వాగులు వంకలతో పరుగులు తీయును 
అంటు రోగాలు ప్రబలకుండా అమ్మను కొలిచేరు!

ఆషాడమాసమునకు విశిష్టత మెండుగ
తెలాంగాణా ప్రజలకు గర్తుతెచ్చే పండుగ
జరుగు పూరీ జగన్నాథ్ యాత్ర ఘనంగ
నూతన వధువులు పుట్టిల్లు చేరు మెల్లంగ!

ప్రజలు  కాకతీయుల కాలము నుండే
కాకతీ దేవినే భక్తులు కొలుస్తూ యుండిరట
అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆరాదిస్తుండిరట 
మేళాలు వాయిస్తూ బోనాలెత్తుతుండెరట!

ఆషాఢంలో అమ్మవారు పుట్టింటికి వచ్చునని
అంటురోగాలు కలరా మసూచి ప్రభలకుండ
వరదలతో  రాష్ట్రాన్ని ముంచెత్తకుండను
పాలు బెల్లం బియ్యంతో నైవేధ్యాలతో అమ్మకు
కల్లూ వేప మండలాలతో కోళ్ళు కొబ్బరికాయలతో
ఆనందోత్సాహాలతో భక్తులు సమర్పించేరు బోనం!

నాడు హైదరాబాద్ సికింద్రాబాద్ లో
ప్రభలే కలరా ప్లేగు మసూచి వ్యాధులు
వేలాది మంది ప్రాణాలు మట్టిలో కలిసే
పొంగిపొర్లే మూసీనది  ప్రజలు నీటమునిగే!

ఆషాఢ మాసంలో అంటు రోగాలకు
చలి వర్షం ముసురులకు, ప్రకృతి వైపరీత్యాలకు
కోళ్ళు గొర్రెలు మేకలు నేల కూలుతుండే
చల్లంగ కాపాడమని అమ్మవారిని వేడుకుంటూ
ప్రజలు దూప నైవైద్యాలతో బోనాలు ఎత్తుకునేరు
మొక్కులు తీర్చుకునేరు శాంతించమని కోరేరు!

అమ్మ వారి సోదరుడు పోతరాజు 
దేహం నిండ పసుపు కుంకుమ నోట్లో నిమ్మకాయ
చర్నకోలతో తనను తాను కొట్టుకుంటూ
ఊరేగింపుగావస్తుంటే జనులు వణికిపోతుండు!

మొదట హైదరాబాద్ గోల్కొండలో మొదలై
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాలీ నుండి
అది మంగళ గురు వారాలలో ఆషాఢ మంతా
బోనాలు వివిధ ప్రాంతాలలో విస్తృతంగాజరుగు

భవిష్యత్తు పరిణామాలు తెలుసుకునను
రంగమేర్పాటు చేయుదురు భక్త కన్యతో
తీర్చి దిద్దిన కాల్చని కుండపై నిలబడి
అమ్మవారి వేషంలో ఊగుతూ  జనులకు
చెప్పును భవష్య వాణి
అలాగే జరుగునని ప్రజలు నమ్ముతారు!
 

No comments: