Thursday, March 13, 2025

ఒక వ్యక్తి కవిగా ఎందుకు మారుతాడు

 ఒక వ్యక్తి కవిగా ఎందుకు మారుతాడు?

నిజంగానే ఏమైనా కారణాలు ఉన్నాయా?
ఉంటే కవిగా మారడానికి గల కారణాలు ఏమిటి?
దేశంలో సుమారుగా నూటా నలుబది రెండు కోట్ల ప్రజలు ఉంటే
కొందరే కవులుగా మారడానికి గల కారణాలు ఏమిటి?
మిగిలిన వారు ఎందుకు కవులుగా మారడం లేదు?
నేడు వ్రాస్తున్న కవులలో అధిక విద్యావంతులైన
డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ఇంజినీర్లు ఉన్నారు, అకౌంటెంట్లు ఉన్నారు. టీచర్లు ఉన్నారు, ఆచార్యులు ఉన్నారు, స్కాలర్లు ఉన్నారు, కమర్షియల్ డిపార్ట్మెంట్ వారూ ఉన్నారు,పోలీసులు ఉన్నారు, మేధావులు ఉన్నారు కళాకారులు ఉన్నారు, ఇతరులు ఉన్నారు.

ఎవరు ఉన్నా దేశ జనాభాలో చూస్తే, 0.000001 పరిషెంట్ మాత్రమే కవులు ఉంటారు.

ఉన్న కవులలో కూడా అందరు అన్ని రకాల కవిత్వాలను బాగా వ్రాయలేరు.
కొందరు శృంగారం , కొందరు భక్తి , కొందరు సాంఘీక , సామాజిక, మరికొందరు ప్రకృతి, కొందరు మనస్సు, ఇంకొందరు జానపదాలు, ఇంకా కొందరు పాటలు చాలా బాగా వ్రాస్తుంటారు.
కొందరు మాత్రమే అన్ని రకాలుగా వ్రాస్తారు.

అతి కొద్దిమంది మాత్రమే అభ్యుదయ, విప్లవ, స్వేచ్ఛా, ధిక్కార కవిత్వం వ్రాస్తుంటారు.

వాస్తవానికి చూస్తే ఇతర కవిత్వం వ్రాసే వారికంటే
అభ్యుదయ, విప్లవ, స్వేచ్ఛా , ధిక్కార కవిత్వం లేదా పాటలు, పద్యాలు వ్రాసే వారు ప్రత్యేకమైన వారిగా కనబడుతారు.

ఇతర కవుల కంటే, ధిక్కార కవులకు ఎదురుదెబ్బలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, మనసు ప్రశాంతత ఉండదు. ఇంట్లో వారు వ్యతిరేకిస్తారు, బయటి వారు వ్యతిరేకిస్తారు. అయినా ధిక్కార కవిత్వం వ్రాస్తుంటారు.

ఎందుకు ఇలా కవులు ఉంటారు?
దీనికి గల కారణాలను ప్రముఖ మానసిక, వైజ్ఞానిక నిపుణులు, దాశరథి గారికి  శతజయంతి ఉత్సవాల సంబంధించిన అంతర్జాల మీటింగ్ లో  *డాక్టర్ చిన్నోజి వీరేందర్* గారు ఇలా విశ్లేషిస్తారు.

"సిగ్మండ్ ఫ్రాయిడ్ థీరీ ప్రకారం మనుష్యులలో
ఈద్ , ఇగో, సూపర్ ఇగో అను మూడు రకాల వారు ఉంటారు. 

No comments: