Sunday, March 16, 2025

అమ్మ చిన్ని ఆశ

 తేది:16.03.25


కవిత శీర్షిక: *అమ్మ చిన్ని ఆశ*


కొడుకుల్లారా! బిడ్డలారా!

ఈ రోజు మీరు ప్రశంసిస్తుంటే 

ఎంతో ఆనందంగాను మహానందంగా ఉంది!


నేను అమ్మనే కల్పవల్లినే బంగారు తల్లినే 

అమృతాన్నే  సృష్టి కర్తనే  బ్రహ్మనే

త్యాగశీలినే  ఏ స్వార్థం లేని క్రొవ్వొత్తినే!


ప్రశంసా పత్రాల కొరకో మెమొంటోల కొరకో 

శాలువాలతో చేసే సన్మానాల కోసమో

సంకలనాలకో కవితలు వ్రాస్తున్నందుకు

మహానందంగా ఉంది!


బిడ్డా! ఒక్క సారి వెనక్కి తిరిగి చూస్తే,


కొంత కాలం గాంధీభవన్ దగ్గర 

బిక్షమెత్తమని ఎండలో కూర్చో బెట్టి 

వచ్చిన డబ్బులు కాజేస్తిరి 


ఆస్తులన్నీ తీసుకొంటిరి పెన్సన్ తీసుకుంటిరి 

ఆశ్రమంలో పడేస్తిరి అక్కడనే జీవం పోయే


ఇంట్లో ఉంచుకోమంటే 

నా భార్య వద్దంటోంది అంటిరి! 


మీ కుక్కకు పెట్టింది పెట్టండి నాయినా 

మీ కాళ్ళ దగ్గర పడిఉంటామంటే జాగ లేదు 

మా పిల్లల చదువులు దేబ్బ తింటాయంటిరి!


కొడుకుల పరువు పోతుందని

సరే నా పెన్షన్ తీసుకునే తిండి పెట్టమంటే 

దిక్కన్న కాడ చెప్పుకో అని ఎ టి ఎమ్ 

గుంజుకుని బయటకు గెంటేస్తిరి!


శ్మశానం వద్ద పడేసి 

పిచ్చిదై తిరుగుతుందని అంటిరి!


శిశిరం వస్తుందనీ, రేపు మీరు పండుటాకులై 

రాలిపోతామన్న యావ మరిచితిరి!


ఇలాంటి అమ్మ కవితల పోటీలు జరుగాలనీ

రాతలకు కట్టుబడైనా కొందరు 

తల్లి దండ్రులను తమ వద్దే ఉంచుకుని 

పోషిస్తారని *అమ్మ చిన్ని ఆశ* ,


శ్రీమతి రమాదేవి మార్గం 

హైదరాబాద్

No comments: