Thursday, March 13, 2025

ప్రేమ కోసం తపన

అంశం: లలిత గీతాలు


శీర్షిక: *ప్రేమ కోసం తపన*

పల్లవి:
అతడు:
ఓ...ఎలా నిన్ను వదిలి ఉండాలే...
మనసు నిలకడుండుట లేదే
నోట మాట రావడం లేదే...
నా మది నిండా నీవే ఉన్నావే....
నీవే ప్రపంచమను కున్నానే...
ఒంటరిగా ఉండలేక పోతున్నానే....
నీవు నాకు దగ్గరగా ఉండవే..
చచ్చి పోవాలనుకుంటున్నానే.....
ఆకాశంలోని నక్షత్రాలన్నీ తీసుకొస్తనే ...
నేను ఉండ లేక పోతున్నానే ...
నన్ను విడిచి ఎక్కడికీ వెళ్ళకే...

చరణం:01
ఆమె:
ఓ... స్నేహమే మనదీ...
ఎప్పుడూ నేను అలా చూడలేదు...
ఆశలేమి పెట్టుకోకు నా పైనా...
మనసు పాడు చేసుకోకూ...
నాకా ఆలోచన కూడా లేదు...
స్నేహంగా కలిసే ఉందాం ఎప్పటికీ....

అతడు:
ఓ... అలా నీవు అనబోకే...
నిన్ను నేను మరిచి పోనే...
నా హృదయంలో నీవే ఉన్నావే...
నన్ను నీవు కాదనకే....
నిన్ను విడిచి బ్రతుక లేనే.....          "ఓ ..ఎలా"

చరణం :02    
ఆమె:
ఓ.. ఎపుడూ నేనూహించలేదు....
కొత్త కొత్త కోరికలు పెంచుకోకూ...
సమయం వృధా చేసుకోకూ...
కాని  బాసలేమి చేయబోకూ...
కష్టాలను కొని తెచ్చుకోకూ....

అతడు:
ఓ...నీవు లేని జీవితం ఊహించలేనే....
ఒంటరిగా నేను జీవించ లేనే....
నాపై కోరికను వదులుకేకే...
నిన్ను సంతోషంగా ఉంచుతానే...
నీకు స్వర్గం చూపిస్తానే......           "ఓ...ఎలా"

చరణం:03
ఆమె:
ఓ.. నీ మాట నాకు నచ్చింది...
నీ మనసు నాకు నచ్చింది....
నీవంటే నాకు ఇష్టమే...
నీతోనే నేను ఉంటాను...
నీ గుండెలో నాకు చోటివ్వవా....

అతడు:
ఓ... అందాల తారవే...
మందారా పూబోణివే...
సుందర స్వర వాణివే...
హుందాగా ఉంటవే....
ఎప్పుడూ నా దానవే....

అతడు,ఆమె: (కలిసి)
ఓ... నిన్ను వదిలి ఉండలేను...
మనసు నిలకడుండటం లేదు..
నా మది నిండా నీవే ఉన్నావు..
నీవే నా ప్రపంచమూ....
నా మనసు నిన్నే కోరుకుంటున్నది..
నా హృదయం నిన్నే కోరుచున్నదీ...
కలిసే మనం ఉందాము..

     

No comments: