శీర్షిక: *స్వార్ధం లేనిది జగతిలో ఒక్కరే అదే అమ్మ*
గొడుగుకు పై వస్త్రం నాన్నవుతే
ఆ గొడుగుకు నిలువెత్తు స్టాండ్ అమ్మ
లోపల చుట్టూరా పుల్లలే పిల్లలు
అలా నాన్నకు అండగా ఉంటూ
ఇంటిల్లి పాదికి రక్షణ ఇచ్చేది అమ్మ!
*స్వార్థం లేనిది జగతిలోఒక్కరే అదే అమ్మ*
అంగడిలో దొరుకనిది అమ్మ ప్రేమ
ఎన్నో పూజలు చేసి నవ మాసాలు మోసి
ప్రసవ వేధనలతో , రధిరాన్ని చిమ్మి
బొడ్డు ప్రేగు బంధంతో జన్మనిస్తుంది
శిషువుకు ఆ మాతృమూర్తి!
చనుబాలను యిచ్చి , ఉగ్గు పాలను పోసి
ఒడిలో పరుండబెట్టి ప్రేమాప్యాయతలు పంచి
ప్రాణాలను ఫణంగా పెట్టి , కంటికి రెప్పలా
రేయింబవళ్లు రెక్కలు ముక్కలు చేసుకుని
పెంచి పెద్ద చేసి , బిడ్డల ప్రయోజకుల జేస్తే!
పెండ్లాల మోజులో పడి, డబ్బు ధ్యాసలో
బంధాలను , వ్యక్తిత్వాలను గాలికి వదిలి
మాతృమూర్తుల అనురాగాలను మరిచి
చరవాణులతోనే నిత్యం మమేకమైరి
నేటి పుత్ర రత్నాలు
నవ మాసాలు సమానంగా మోసింది మరిచి
సమానంగా చదివించింది పెంచింది విడిచి
సమానంగా పెళ్ళిళ్ళు చేసింది గ్రహించక
భర్తా పిల్లల చరవాణి మోజులో పడి
తల్లిదండ్రుల పోషించడం పురుషుల భాద్యతని
ఓ నెల రోజులు ఉంటే డబ్బులు లెక్కగట్టే
నేటి పుత్రికా రత్నాలు!
ప్రశంసా పత్రాల కొరకు అమ్మపై
బోలెడన్ని కవితలు వ్రాయడమే గాకుండా
చనుబాలను యిచ్చి , ఉగ్గు పాలను పోసి
ఒడిలో పరుండబెట్టి ప్రేమాప్యాయతలు పంచి
ప్రాణాలను ఫణంగా పెట్టి , కంటికి రెప్పలా
రేయింబవళ్లు రెక్కలు ముక్కలు చేసుకుని
పెంచి పెద్ద చేసి , బిడ్డల ప్రయోజకుల జేస్తే!
పెండ్లాల మోజులో పడి, డబ్బు ధ్యాసలో
బంధాలను , వ్యక్తిత్వాలను గాలికి వదిలి
మాతృమూర్తుల అనురాగాలను మరిచి
చరవాణులతోనే నిత్యం మమేకమైరి
నేటి పుత్ర రత్నాలు
నవ మాసాలు సమానంగా మోసింది మరిచి
సమానంగా చదివించింది పెంచింది విడిచి
సమానంగా పెళ్ళిళ్ళు చేసింది గ్రహించక
భర్తా పిల్లల చరవాణి మోజులో పడి
తల్లిదండ్రుల పోషించడం పురుషుల భాద్యతని
ఓ నెల రోజులు ఉంటే డబ్బులు లెక్కగట్టే
నేటి పుత్రికా రత్నాలు!
ప్రశంసా పత్రాల కొరకు అమ్మపై
బోలెడన్ని కవితలు వ్రాయడమే గాకుండా
ఎవరికి వారే ఆత్మ పరిశీలన చేసుకుని
తల్లిదండ్రులపై కాసింత నిజమైన ప్రేమను
జాలి దయ కరుణ చూపిన ఎంతో బాగుండు!
తలిదండ్రుల పోషించక పోవడం ద్రోహం
అనాధాశ్రయాలలో వేయడం హేయం
చావకముందే పాడే వేయడం మహాపాపం
వారికి నుండదు జగతిలో నికను మోక్షం!
అనుభవిస్తారు బ్రతికున్నంతకాలం జగతిలో
కర్మ సిద్ధాంతాన్ని ఎవరు తప్పించు కోలేరు
ఇది యుగ యుగాల బలమైన *సత్యం*!
తల్లిదండ్రులపై కాసింత నిజమైన ప్రేమను
జాలి దయ కరుణ చూపిన ఎంతో బాగుండు!
తలిదండ్రుల పోషించక పోవడం ద్రోహం
అనాధాశ్రయాలలో వేయడం హేయం
చావకముందే పాడే వేయడం మహాపాపం
వారికి నుండదు జగతిలో నికను మోక్షం!
అనుభవిస్తారు బ్రతికున్నంతకాలం జగతిలో
కర్మ సిద్ధాంతాన్ని ఎవరు తప్పించు కోలేరు
ఇది యుగ యుగాల బలమైన *సత్యం*!
No comments:
Post a Comment