అంశం: ప్రక్రియ: ప్రయాగ
(అనేక అలంకారాలతో కూడిన కవిత)శీర్షిక: *ఆకాశంలో ఉరుములు మెరుపులు*
ఆకాశంలో నీలి మేఘాలు *అక్కడక్కడ* కమ్ముకుని ఉన్నాయి
ఉరుములు మెరుపులతో కూడిన శబ్ధాలు బయంతో జనం
పక్షులన్నీ వాటి వాటి గూళ్ళకు పరుగులు పెడుతున్నాయి
ప్రజలు ధైర్యంగా ఉండడానికి అర్జునా ఫాల్గుణా అంటూ *స్మరిస్తున్నారు*
మరికొందరు ఎక్కడ పిడుగు పడుతుందోనని ప్రాణాలను బిగపట్టుకుని *కూర్చున్నారు*
అనుభవజ్ఞులు ఏమి కాదు పిడుగులు చెట్లమీదనే పడుతాయని ధైర్యం *చెబుతున్నారు*
ఆకాశంలో అప్పుడప్పుడు చరచర మంటూ *మెరుపులు*
*మెరుపులు* ఆగిన కొద్ది సమయానికి ఉరుముల శబ్ధాలు వినిపిస్తున్నాయి
ఆహా! ఆ అనుభూతి మరువలేనిది
*హోరు హోరున* గాలులతో కూడిన వర్షం కురుస్తుంది
*భళభళ* మంటూ ఎత్తెన తరువులు విరిగి పడుతున్నాయి
*బెకబెక* మంటూ మండూకాల అరుపులు వినిపిస్తున్నాయి
బిల్డింగులలో తలదాచుకున్నారు కొందరు
పెద్దలిస్తున్నారు పిల్లలకు అ *భయం భయం* తో వణుకుతుంటే
కుటుంబ సభ్యులలో కనబడుతుంది ఎంతో అను *బంధం బంధం* వేసినట్లుగా బావిస్తున్నారు మరికొందరు
ఉరుములకే అంత భీతి అవసరమా *రమా రమా* దేవికి ఇద్దరూ ఆడపిల్లలే
ఆకాశంలో నీలిమేఘాలు *అక్కడక్కడా* కమ్ముకుని ఉన్నాయి
No comments:
Post a Comment