Friday, March 21, 2025

కలల రాణి (చిత్ర కవిత)

అంశం: చిత్ర కవిత (ప్రియులజంట)


శీర్షిక: ఓ .. నా కలల రాణీ

ఇది కలయా నిజమా!
ఓ నా కలల రాణీ!
ఓ నాట్యమయూరీ!
నమ్మలేక పోతున్నాను,
ఓ నా నాట్య రవళీ
ఏమిటీ నీ కొన కంటి ఓర చూపులు
చురకత్తుల్లా దూసుకొస్తున్నాయి!

నీలి మేఘాల్లాంటి పొడుగాటి కురులు
కురులలోన రంగు రంగుల మల్లెల విరులు
మంచి ముత్యాల వలే మిలమిల మెరిసే పళ్ళు
హంస రెక్కల్లాంటి కను రెప్పలు
కంఠాన మేను రంగు పూసల హారము
చెవులకు బుట్టాలు , నుదుట సిందూరం
సూర్య బింబం వలే తేజస్సుతో మోము
కృష్ణ నీలి రంగు జాకెట్టు, బంగారు రంగు చీర
బహుసుందర వదనం అదిరి పోయింది రాణీ

దివి నుండి భువికి దిగివచ్చిన అప్సరసవా
శిల్పి చెక్కిన నాట్య మంజరివా
బాపు చిత్రించిన భాగ్య సుందరివా
నా మదిని దోచిన స్వప్న సుందరీ
నీ మధుర వాణి వినిపించవే
నా ప్రేమను ఆలకించవే
నాకు నీ హృదయంలో కాస్త చోటివ్వవే
నీవు లేక నేను లేను, నిన్నొదిలి నేను ఉండలేను
ఓ నా కలల రాణీ
ఓ నాట్య రవళీ
ఓ నాట్య మయూరీ!







No comments: