Sunday, March 16, 2025

కవితలు

 నరుడా ! ఓ నరుడా! 

********************
నరుడా ! ఓ నరుడా!  ఓ బావి పౌరుడా !
నర నారాయణుడికైనా ,  మాత యేరా మూలం
నరులందరికీ , నొక్కడేరా  దేవుడు

బొడ్డు కోసిన నాడు , నూలు పోగు రాదు
జీవి వెళ్లిన నాడు , అంగ వస్త్రం  పోదు

తల్లి ఒడిలోనే నెవరైనా , చనుబాలే త్రాగేరు
దృష్టి పడని నాటికి , కపటమంటూ యెరుగరు

నరుల నరాల్లోన, నడిచేది  నెత్తురే
నాది నీదనే స్వార్ధం , దరి చేయ నీయకు

విద్య బుద్దులు నేర్చి , వినయంబు పెంచు
మాటకారి తనంతో , మోసాలు చేయకు

అమాయక ప్రజలకు , టోపీలు వేయకు
సమానత్వ లోపాలే , ఈ జగతిలోన యుద్దాలు

ఆశ తగ్గిస్తే , సుఖ శాంతులు విరిసేను
అహం  కాల రాస్తే  , గౌరవాలు పొందేరు

నీవు నేర్చిన విద్యను , నలుగురికి పంచు
నిత్యం వృత్తులతోటి  , ఉత్పత్తులు పెంచు

నీవు పాటించని నీతులు , వల్లించ  బోకు
నీకు తెలియని వాటిని , పట్టించు కోకు

నిను కన్న తలి దండ్రుల , మరువ బోకు
ఆలు బిడ్డల నెల్ల , చల్లంగా చూడు  

శాశ్వతమంటూ ఏదీ లేదు . ఈ ధరని లోన
నిండు మనసుతో నొక్క , మేలైన తలపెట్టు

నీ జన్మ భూమిని , నిర్భయముగా పొగడు
నీ భరత మాతకు , రక్షణగా నిలువు

నిత్య పురస్కారాలతో  , ప్రజలు నిను కొలిచెదరు
జగతిలో నీ కీర్తి , వర్ధిల్లు చుండు  



*కలియుగం*
🍃🍂🍃🍂🍃🍂🍃
పరుగెడుతూ ఉంటుంది  *కాలం*
ఆపలేరెవ్వరు దానిని  *క్షణ కాలం*  "పరుగెడుతూ"

విద్యార్థులకు లేకుండా చేశారు *గళం*
విద్యార్థి సంఘాలకు వేశారు  *తాళం*   "విద్యార్థులకు"
 
కార్మికులకు లేకుండా చేశారు *దళం*  
కార్మిక సంఘాలకు లేదిక *బలం*      "కార్మికులకు"

కవి చేతిలో ఉంది *కలం*
నిజాలు రాయాలంటే లేదు *స్థలం*  "కవి"

రైతు చేతిలో ఉంది *హలం*
దున్నాలంటే లేదు *పొలం*   "రైతు"

శ్రుష్టించారు మనుష్యులకో *కులం*
ఎవరికీ దక్కేనో పధకాల *ఫలం*    "శ్రుష్టించారు"

పేద ఆడపడుచుల మేడలో లేదు *తులం*
నక్లెస్ రోడ్ లో జరుగుతుంది రోజూ  *మేళం*  "పేద"

ఎవరూ జీవించారు యెల్లా *కాలం*
ఎవరికీ పుష్టినిచ్చునో పుష్కర  *జలం*  "ఎవరూ"

విదేశీయులందిస్తున్నారు *శీతలం*
దేశీయులవుతున్నారు  *అతలా కుతలం*  "విదేశీయు"

ఓటర్లకు వేస్తారు నేతలు *గాలం*
అందుకే కావాలి నిరుపేదలందరికీ   *జన బలం*  "ఓటర్లకు"

కరోనా  అయ్యింది ప్రజలకు  *భారం*
కరోనా అవుతూంది  కొందరికి  *వరం*     ''కరోనా"


*కాదేది కవితకనర్హం*!
****************
*కుక్క పిల్ల*
*అగ్గిపుల్ల*
*సబ్బు బిళ్ళ*
కాదేది కవితకనర్హం ,
అంటారు *శ్రీ ,శ్రీ* .

మద్యం త్రాగే వారికి
పద్యం ఎదో ,గద్యం ఎదో ,  
కవిత  ఎదో , వచనం ఎదో
అర్ధం కాదు . మనవారెవరో
పరవారెవరో  అర్ధం కాదు.
కాదు కాదు ,అవుతుంది
మద్యం దిగాక  లేదా
సాటి  వారిని అర్ధం
చేసుకున్నాక .

జీవితం పై విరక్తి
చెందాక ముసలి తనం
లోనే వ్రాశాడు
*వేమన* , పద్యాలు.
ఏమి చదివెనో , ఎలా వ్రాసేనో
సంకలనం చేసిన ,
*సి .పి. బ్రౌన్* కే ఎరుక .

కటిక జీవితాన్ని
అనుభవిస్తూ ,
ఒక్క సిరా చుక్క
వేయి మెదళ్ళు  
కదిలించు నన్న  
*కాళోజీకి*  తెలంగాణా
వచ్చాకనే ,కాటికి కాలు
సాచాకనే వచ్చింది  
గుర్తింపు .

ఒక  ఇంర్వ్యూ లో
పది పాసయ్యావా ,
ఫెయిలయ్యవా,
అని అన్నాకనే ,
వచ్చింది పట్టుదల
*సుద్దాల అశోక్ తేజ* కు
(అప్పటికే  వారు ఎం. ఏ.
గోల్డ్ మెడలిస్ట్ .)

గద్దరన్న , ఒక్క మీటింగ్
అటెండవుతే చాలు,
పుట్టుకొస్తాయి
విప్లవ గీతాలు .

*గోరెటి వెంకన్న*
జానపద గీతాలు ,
గగన కుసుమాలు .
ఎవరి *గళం*  వారిదే ,
ఎవరి *కలం* వారిదే .
ఎవరి *గుర్తింపు* వారిదే.


*ఉత్తర కొరియా*
****************
పొగరెత్తిన ఆంబోతులా
ఉలికి పడుతున్నది!
బాంబులున్నాయని
కాబోలు!
లేదా
డబ్బు లున్నాయని
కాబోలు!
లేదా
చైనా తన జిగురు దోస్తని
కాబోలు!
లేదా
టెక్నాలజీ తనకే తెలుసని
కాబోలు!
లేదా
ఈ ప్రపంచం పై
పెత్తనం తనదే ఉండాలని
కాబోలు!
 
ప్రపంచ పెద్దన్న
మీదికే
కాలు దువ్వుతుండే!

తెలియక  దోస్తాను
చేసే ఇండియా
తెలిసింది  ముందుగానే
మన మంచికే !

జాతికి ద్రోహం చేసే
ఎవరైనా ,
అహంకారమున్న
ఎవరైనా ,
పొగరున్న
ఎవరైనా ,
తేనె పూసిన కత్తిలా
ఉండే ఎవరైనా ,
అందరికంటే నేనే
గొప్ప అనుకునే
ఎవరైనా ,
నాకే అన్నీ తెలుసు
అనుకునే ఎవరైనా,
కాల గర్భంలో
కలువక తప్పదు .


*కంపు కొడుతుంది!*
********************
కంపు కొడుతుంది!
గోళం!  భూగోళం!

కరోనా వైరస్ తో
గుట్టల్లా పేరిన
శవాలతో
కందకాలలో
నిండిన కళేబరాలతో  
కంపు కొడుతుంది!
గోళం!  భూగోళం!

వైరస్ తో  నిండిన
జలాలను వడకట్టి ,
కాచుకుని  త్రాగినా
కరోనా రాదనే
వారంటీ లేదు
గ్యారేంటీ లేదు
కంపు కొడుతుంది!
గోళం!  భూగోళం!

సందెట్లో సడేమియా లా
దోచు కుంటున్నాయి
దవాఖానాలు.
కరోనా వైరస్ తో
సమాజాన్ని
కలుషితం
చేస్తున్నారు మరి కొందరు.
వెళ్లిరా  కరోనా!
ఇక వెళ్లి రావమ్మా!   


*పేరడి*
********
సరిలేరు నీకెవ్వరూ ... ఓ నరేంద్రా ...
సరి రారు నీకెవ్వరూ ....... "సరి"

రాజ నీతిలోనా , రాజుల మించి నావు
రణ భూమి యందు , వాజపేయిని మించి నావు  
ఈ దేశ ప్రజలందరూ , ఓ నరేంద్రా......
జోహారు లను చుండిరి....   "సరి"

బ్రహ్మ చారివై  నీవు , భవ బంధాలు వీడి
ఆర్ ఎస్ ఎస్ లో చేరో  , అర్జునుడవైనావు
ఈ దేశ ప్రజలందరూ , ఓ నరేంద్రా......
జోహారు లను చుండిరి....   "సరి"

తాతను మించి నావు , తండ్రిని మించి నావు
ప్లానులు వేసి నావు, పార్టీని నిలిపి నావు  
ఈ దేశ ప్రజలందరూ , ఓ నరేంద్రా......
జోహారు లను చుండిరి....   "సరి"

చెదలు పట్టిన  చట్టాల , చెత్తలో కలిపావు  
తలాక్  చట్టాలను , తుడిచి పెట్టావు  
ఈ దేశ ప్రజలందరూ , ఓ నరేంద్రా......
జోహారు లను చుండిరి....   "సరి"


ఆధార్ లింకులతో  , అవి నీతి నడ్డుకుని
నోట్ల రద్దు చేసి , నల్ల ధనం బయట పెట్టావు  
ఈ దేశ ప్రజలందరూ , ఓ నరేంద్రా......
జోహారు లను చుండిరి....   "సరి"

కరోనా మహమ్మారితో , కుస్తీలు పట్టావు
లాక్ డౌన్ తో , కరోనా నరికట్టి నావు
ఈ దేశ ప్రజలందరూ , ఓ నరేంద్రా......
జోహారు లను చుండిరి....   "సరి"

దేశ భద్రత యందు , నీకు సాటిలేరెవ్వరు
చైనాను  ఉరికించి , తరిమి కొట్టావు
ఈ దేశ ప్రజలందరూ , ఓ నరేంద్రా......
జోహారు లను చుండిరి....   "సరి"

పటేల్ ను ప్రతిష్టించి , ప్రజలలో ధైర్యాన్ని నింపావు
రామాయలయ నిర్మాణంతో, దేశ ప్రతిష్టను పెంచావు
ఈ దేశ ప్రజలందరూ , ఓ నరేంద్రా......
జోహారు లను చుండిరి....   "సరి"

విద్యావిధానాన్ని , వినూతన విధానాలతో
రాబోయే తరాలకు , మార్గ దర్శక మయ్యావు.
ఈ దేశప్రజలందరూ , నరేంద్రా .....
జోహారు లను చుండిరీ......



*వ్యక్తిత్వాన్ని కోల్పోకండి*
🌻🌼🌻🌼🌻🌼🌻
ప్రశ్నించే తత్వం
పోరాడే మనస్థత్వం
లేకపోతే
బ్రతికినంత కాలం
భయపడుతూనే
జీవించాలి.

నీ అంతరాత్మ ప్రకారం
నీవైపు తప్పు 
లేనంత కాలం ,
నమ్మిన సిద్ధాంతాల కొరకు
పోరాడుతూనే
ఉండాలి.

ఎదిరించే వాడు
లేకపోతే
బెదిరించే వాడిదే
రాజ్యం.

బానిసలుగా ,
పరాన్న జీవులుగా 
జీవించకండి
వ్యక్తిత్వాన్ని 
కోల్పోకండి.



*జానపద గేయం*
*************
(తేదీ. 22 .02 .1978  లో వ్రాసినది)
(శ్రీ లక్ష్మీ నీమహిమలో చిత్రమై తోచెనేమి, స్టైల్)

ఓరోరి నవాబూ -  నీ మహిమ చిత్రమై తోచేనేమి
ఇంద్ర దేశం లోన -  ఇగ్నూ శిష్యుడవై
అహోబిలంలో ఘరానా దొంగవై - మా నోళ్లు మూసితివిరా  "ఓరోరి"

అధికార దాహంతో - అమదాగ్ని రాష్ట్రంలో
ఎమర్జెన్సీ విధించి - ప్రజలను  బాధించి
తల్లీ పిల్లనక  - కల్లోల పరిచి
మానోళ్లు కట్టితివిరా - మా నోళ్లు మూసితివిరా   "ఓరోరి"

నాజీరు గాడిని - సంక లిరికించుకుని
సంతలా  మార్చావు - సొంత ఊరును
అందులో చేర్చావు - అందాల తారల
పెండ్లిళ్ళ పేరయ్య - పెద్దన్నలా నీవు
తగదు నంటూనేనురా - తార్పుడిగా మారావురా  "ఓరోరి"

శంకు స్థాపనాలంటూ - శఠగోపం పెట్టి
గౌరుమెంటు సొమ్మును - గల్లంతు చేసి
వందలాది మందిని  - బొందల్లో నింపి
పాపాలు చేశావురా - గంగలో మునిగావురా  "ఓరోరి"

నీ మాట కడ్డొస్తే - నిందితుడిలా మార్చావు
విద్యార్ధులందరిని  - ఊరి బయట నిలబెట్టి
చెట్టు గుట్టలనక - కట్టేసి కొట్టుచూ
గాయాలు చేశావురా  - రాక్షసుడి వయ్యావురా  "ఓరోరి"

ఊబి దిప్ప పేరుతో  -  ఊరూరా తిరిగి
పై పై సొమ్మును - పై రోగులకిచ్చి
అసలైన సొమ్మును - గాజల్లో నింపి
మా నోళ్లు కట్టితివిరా - మానోళ్లు మూసితివిరా  "ఓరోరి"

ఎన్నికలు రాగానే - ఏమర పాటుతో
పల్లె పల్లెలనక - పగలు రేయిళ్ళనక
ప్రసంగాలు  చేయుచూ - పైర తిరుగుతున్నావు
నీ ఓటమి తప్పదురా - నిన్నొదలడు కాళోజిరా "ఓరోరి"



No comments: