Saturday, March 15, 2025

హోలి హోలీల రంగ

అంశం: హోలి


శీర్షిక:  *హోలి హోలీల రంగ*

పల్లవి:
హోలీ హోలీల రంగ  హోలీ
చమ్మకే ళీల  హోలీ         "2"

చరణం:01
బీదవారి కష్టాలన్నీ         
ఆకాశాన్ని అంటుచుండే  
కూలి వారి చెమటంత    
వరదలై పారు చుండే      
దుందామంటే భూమి లేక   
తిందామంటే తిండి లేక      
జీత ముండే కన్న బిడ్డలు    
బానీసలుగ  బ్రతుకుతుండే  
కరువులొచ్చే , కష్టాలొచ్చే      
బిడ్డ పెండ్లికి  అప్పులు దెచ్చే    "హోలి హోలీల"

చరణం:02
పగలు రేయనకుండా             
కాయా కష్టం చేసిన గాని        
పెళ్ళాం పుస్తే అమ్మిన గానీ     
బిడ్డా గొలుసులు అమ్మిన గానీ 
వడ్డీలు  తీరక పాయే              
వయసంతా ఉడిగి పాయే       
ఎన్నడు తీరు  మా బాధలు       
ఎలా తీరు  మా వ్యధలు           "హోలి హోలీల"

చరణం:03
తెల్లందాక  పొద్దుందాకా      
రెక్కలిరిచిరి  కూలివారు       
వచ్చిన కొత్తలు మూట గట్టి  
కోమటిoట పోసిరయ్య         
ధరలన్నీ పెరిగాయని           
ధరల పట్టి చూపిరయ్యా      
పావు శేరు బియ్యమొచ్చె     
పప్పు మాత్రం ఉద్ద్దేరాయే     
బిడ్డలకైతే పెట్టి రయ్య            
భార్యా భర్తలు ఎండిరయ్య      "హోలి హోలీల"


No comments: