Thursday, March 13, 2025

హిమాలయాలు - రోతాంగ్ పాస్

పదాల కవిత :ఆకాశం , పచ్చదనం
జలపాతం , ఆనందం

శీర్షిక: హిమాలయాలు - రోతాంగ్ పాస్

ఉషోదయ సమయాన హిమాలయాలలో
మంచు గడ్డలపై  ఎగురుడు దునుకుడు
పిల్లల కేరింతలు ఎంతో *ఆనందం* కలిగించే
లోతైన లోయలలో  విరుల సోయగాలు
మరెంతో మనసును పులకరింపజేసే!

ఎత్తెన దేవదారు వృక్షాలు
ఎటు చూసినా మంచు పరదాల దుప్పట్లు
కమనీయ చల్ల గాలి తెమ్మెరలు
నిండుగ పారే సుందర నదీ ప్రవాహాలు!

*ఆకాశం* లో మబ్బులు అరుదైన విహాంగాలు
ఉత్తరాన ఎత్తెన మంచు కొండలు
కొండలమధ్య పారే బియాస్ నదీ జలాలు
హృదయాన్ని పరవసింప జేయు!

ఆహా! ఏమీ ఆ ప్రకృతి మాత సృష్టి 
తరులు గిరులు కొండలు *జలపాతాలు*
మంచు జలాలతో కడుపు నింపుకుంటున్న 
చెట్లు చేమల *పచ్చదనం* కనువిందు చేస్తుండే!

అక్టోబర్ నుండి మే వరకు గల కాలంలో
కిక్కిరిసిన పర్యాటకులతో "రోతాంగ్ పాస్"
నిత్యం పరవళ్ళు తొక్కు తుండు!
 

No comments: